పుట:Goopa danpatulu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
144

గోపదంపతులు.

     మరునాటి మధ్యాహ్నము రెండుజాముల మీఱు నప్పటికి వారు వాల్తేరుచేరిరి. అక్కడినుండి బండిచేసికొని వారు సాయంకాలమునకు గోపాలపట్టణముం జేరుకొన్మిరి.
   

17. ఆశ్లేషము

      గోపదంపతులను స్టేషనుకడనే యర్మొగము పిళ్ళగారు చూచి పరామరిశించిరి. ఆయనకు గంగమ్మ యుదంతమెల్ల నత్తమామలవలన దెలిసినది. అతడు వారికి నొచ్చుమాటల వాడక, వారిక్షేమోదంతములు మాత్రమే యరసి నాటికి వారియింట నాగుడనిబలవంత పెట్టెను. కానియప్పలసామికి దమిళులతో యౌందన్న నొకవిధమైన గోతయు భయమును గల్గియుంటచే, నతడందులకియ్యకొనక, యూరిలోనికిబొయి, కరణముగారియింట బసచేసెను. కరణముగారు గోపులరాక కెంతొసంతోషించి వారి కారాత్రి తమయింట విందుజేసిరి. బోజనానంతరమున గంగమ్మకరణముగారి యాడువాండ్రతో దమయిడుమలం గూర్చి సవిస్తరముగాజెప్పి యేడ్చెను. కాని తాను రామయ్యచేట్టితో గొంతకాల ముండిన వృత్తాంతము చెప్పలేదు. తనకు గొన్నేడులు మతిచలించి యుంటచే దాను బర్తనువీడి పరస్దలమున నుండవలసివచ్చెననియు నవల మదికుదురుపడుటచే మరల భార్యాభర్తలు కలసికొను భాగ్యము గల్గెననియు, నామెవచించెను. వారామాటలకు గంగ