పుట:Goopa danpatulu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
136

గోపదంపతులు.

ము గల్గుచున్నది. కారణము చెప్పజాలను." అనెను.

  నటే--ఆయాందోళనము నీనరములం బలములేమిచే గల్గినది. నీతో, గొంత మాటాడవలయును. ఒరులెవ్వరును వినరాదు. నీచేటిక నావలకు బొమ్మనుము.
  గంగ--(చేటికనుదూరముగాబొమ్మని యాజ్ఞయిచ్చి) అయ్యా! రాత్రి చెట్టిగారింటికిరాలేదేమి? వారు సుఖులే కదా!
    నటే--వారుసుఖులే వారంపిన సందేశము నీకెఱింగింఛుటకే నేనిటకు వచ్చితిని.
      గంగ--(ఆత్రముతో) సందేశమా! ఏమని?
    నటే--ఇదిగో నీయుత్తరమే యన్నియు దెలుపును. (అనుచు) నొక సంచిలో నుంపబడిన జాబును 'చెక్కును ' జేతిలో బెట్టేను. 
    గంగాబాయి తొందరలో దానినివిప్పి చదువుకొనుచు మొగమున నాశ్చర్యము, నాందొళనము, విషాదము, మున్నగు భావములను వెల్లడించుచుండెను. లేఖ సొంతముగా జదివి యామె నటేశముతో, "అయ్యా! నాకాపురము జెడదీసి నన్నిటకు దీసికొనివచ్చి నాకిట్టి ద్రోహముచేయుట చెట్టిగారికిదగునా?" యని యడిగెను. 
    నటే--అందునకు నేనేమిజవాబు చెప్పగలను? అతడెప్పుడును నమ్మదగినవాడు కాడు. స్దిరత వానికడ నున్న యేయనవచ్చును.