పుట:Goopa danpatulu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

137

మరలుబాటు.

  గంగ--ఆమాట మొదటనే నాకేల చెప్పకపొయితిరి?
   నటే--మొదటజెప్పిన, వాడు నాగొంతుకొఱకడా?
   గంగ--ఇప్పుడు నాకేదిదారి? ఉభయభ్రష్టత్వమని సన్యాస మనునట్లయినది. నాబ్రతుకు.
    నటే--నేనొక యుపదేశమొనర్తును. దాని నాచరింతువేని నీకష్టములు గట్టెక్కును. నీవెట్టిచింతయు బొందనక్కఱలేదు.
    గంగ--అదేదో సెలవిండు.
   నటే--మొదట నీదివ్యసుందరరూపముం గాంచి నీపైవలపునిలిపినవాడను నేను. ఆవల రామయ్య నిన్మోహించినాడు. మాయిరువురిలో నతడు చిన్నవాడగుటచే వాని కొర్కె దీర్చుటయే మంచిదనిచెప్పి మీయుభయులనడుమ నేనడ్డము రాకుంటిని. నీవప్పటికైనను నాపాల బడుదానివేయని మొదటనే తలంచితిని. రామయ్యతో నీవిన్నాళ్ళదాక నుందువనియే నేనుదలపలేదు. ఏదో నీకు ఋణమున్నంతకాలముంటివి. నీవిక నాకడకురమ్ము. అతడిచ్చిన 25 వేలును నీకూతుపేర, బ్యాంకులొ వేయింతును. నీవు గోరునంత ధనము నేనిత్తును. ఐశ్వర్యమునకు నేను రామయ్యకేమియు తీసిపొనివాడనని నీవే యెఱుగుదువుగదా? కావున మారుమాటాడకుండక నేడే నీవు మాయింటికి బయనముకమ్ము. నాబార్యచే నీకూడిగము జేయింతును.