పుట:Goopa danpatulu.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
134

గోపదంపతులు.

గితములను గంగాబాయి కందజేయుడు. నేను మీసెలవుప్రకారము రామయ్యచెట్టిగారి చెట్టబట్టెద" ననెను. రామయ్య యనిర్వాచ్యానందముం బొంది చప్పున నామె కరముంబట్టి "యిప్పుడే నాతొ నీవు రాకతప్పదు. ఒక్కనిముసము తడవైనను నేను భరింపజాల" నని తన మోటారులోనికి లాగుకొని పోయెను. ఆమె "నేడువలదు. రేపువత్తు" నని మొరపెట్టుచున్నను వినక "నీవు నేడేరావలయు. రాకున్న నాయుసురులు నిలువ" వని పల్కుచు నమెను జెంత గూర్చుండబెట్టుకొని "అన్నా! నీ వీమెకారెక్కి బసకేగుము రేపు గలసికొంద" మని నటేశ్ముతొ వచించెను.

   రామయ్య నటిరేయి నాయింతితో భూలోక స్వర్గ సుఖ మనుభవించుచుండెను. రెండుమాసము లిట్లుగడిచిన తర్వాత నామెతల్లియు సోదరుడును దేనా పేటనుండి వచ్చిరి. వారిలో నత్తగారి నత డానవాలుపెట్టి, "మీరేల నాయింటికి వచ్చితి" రని యడిగెను. ఆమె "మాయమ్మయికొఱకువచ్చితి" మనెను. "మీయమ్మాయి యెవ" రన 'నెదుట జూచుటలే ' దా?" యని జానకిని జూపెను. రామయ్య యాశ్ఫర్యపడెను. అప్పుడు జానకి తానాడిన కపటమాట విధము మొత్తము సవిస్తరముగా దెల్పెను. తాను మోహాధిక్యముచే వాడినమాటలు నిక్కువములయ్యెనని మిగుల సంతసపడి యత్తగారిని మఱదిని బ్రీతిమైనాదరించి, యదిమొదలుకొని బార్యనెడబాయక రామయ్య సుఖించుచుండెను.