పుట:Goopa danpatulu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

133

పునస్సమాగమము.

త కొకలేఖ, విడాకులైనట్లు తెలుపుచు, వ్రాసి, యామె కీయదలచుకొన్న భరణ మిచ్చి వేయుడు. ఆవలజూతము.

    రామ--అందున కెంతోకాలము గావలయునా! ఇదిగో "చెక్కుబుక్కు" ఇది సదా నాజేబులోనే యుండును. ఇప్పుడే దానికొక చెక్కువ్రాసి యందులోనే  యొకకమ్మయు వ్రాసి యిచ్చుచున్నాను.
   అనుచు 'చెక్కుబుక్కు ' తీసి యెంతమొత్త మీయనా యని యించుక యోచించిమోటారుదీపము కడకరిగి యిరువది యైదువేల కొక చెక్కువ్రాసి మఱియొక కాగితముపై నొక లేఖ యిట్లువ్రాసెను.
     "గంగాబాయి! మనమిరువురము మూడేండ్లు స్వర్గసౌఖ్య మనుభవించితిమి. కాని కారణాంతరముచేత  నేను నిన్ను విడిచిపెట్టవలసివచ్చింది. నీవును రొగపీడితురల  వగుటచేత నాసౌఖ్యమున కుపయోగపడవు. నేనన్య సాహాయ్యముపై నాధారపడకతప్పదు. నేనిట్టు లొనర్చుచున్నందుల కన్యధా తలంపక, నేనిందుతో బంపియున్న, చెక్కును స్వీకరించి, యందుగుర్తింప బడిన విత్తముతో నీవును నీకూతురును నెందేని కాలక్షేప మోనరింపుము. నాదర్శనము నీకికదొరకదు. రామయ్యచెట్టి"
    లేఖయు చెక్కును రామయ్య యాసుందరిచేతిలో బెట్టెను. ఆమెయు మోటారుదిగి యాకాగితములం జదువుకొని తృప్తిజెంది వానిని నటేశము చేతికిచ్చి "అయ్యా! తమరీకా