పుట:Goopa danpatulu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7

ఆకర్షణము

ము?అమ్మా!చాలాప్రొద్దెక్కినది. నేనుబసకుబోవలయును. సెలవు దయచేయుడు

  అనిగంగమ్మ వట్టిచెంబులు పసులకాపరిచేతికందిచ్చి యింటికి బోవుటకై బయలుదేఱెను. అమె సుందరమ్మచెప్పిన మాటలువిన్న తర్వాత జెన్నపురిమీదనే మనస్సంతయు నిలిచియుండుటచేత దానాపట్టణవీధులలో దిరువుచున్నటులే భావించుకొని పరధ్యాసముతోనే నడచిపోవుచుండెను. కొంతదూరమేగునప్పటికి నామెమగడు పొలములో నుండివచ్చువాడు. దారిలో నెదురుపడెను. ఎదుట భర్తయుండుటయు గ్రహింపక యన్యాక్రాంతచిత్తయై గంగమ్మ పోవుచుండుట యప్పలస్వామిగని మెల్లగావెనుకనుండివచ్చి యామెకన్నులుమూసెను. గంగమ్మ యలికిడి తాకుడునుబట్టి తనప్రియుడేయని గ్రహించి, చేయితీయుడు కఱ్ఱవంటికాఠిన్యముగల మీచేతినిగుర్తింప నెట్టివారైననేర్తురు. నేను గుర్తిమోజాలనా?”యని మేలముగాబలికెను. అప్పలసామి చేతులుదీసివైచి “మగవాండ్రయందు నయొడలును, నాడువాండ్రలో నీయోదలును మిగులబలిష్టములగుటచే మనముతాకినప్పుడు మనలను గుర్తింపనివా రెవ్వరు నుండరు. నీవు నన్నాపేక్షేపింప నక్కరలేదు.” అనిబదులూల్కెను.
    ఇట్తులాదంపతులు వేడుకనుడులాడుకొనుచు నొకపావుగంటలో నిలుచేరిరి. వారివురును స్నాములాచరించి ధౌతవస్త్రములగట్టి చట్టులు గుడువబూనిరి.