పుట:Goopa danpatulu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
6

గోపదంపతులు

లో మేలైనవానినెల్ల నందుజూడవచ్చును. నీవాపురమును జూచుట కలతగానిచ్చింతునేని రాగల డిశంబరునెలలో మేమువెళ్లునపుడు నిన్నుదీసికొని వెళ్ళెదములే. ఆనెలలో "పార్కుఫేర్" అనబడు గొప్ప సంతజరుగును. దానినిజూచి నీముచ్చటదీర్తునులెమ్ము "మాకుటిక్కెట్టులక్కరలేదు" కావున మాతో బాటు నీవును రావచ్చును. మాయింటనే భోజనము చేయుచు నీవుందువు. నేనే స్వయముగా నీకావింత లన్నియు గనబఱతును.

       గంగ:--అమ్మా! తప్పకవస్తును. ఒకగిత్తనమ్మి యా సొమ్ముతో బయలుదేఱుదును. వింతసరుకులే వైననున్న గొని తెత్తును. నేనీపల్లెటూళ్ళవెంటబడినుంటి నిగాని, మాపెద్దలు చెన్నపట్టణములోనే యుండెడివారు మాతాత కొన్నాళ్లు చెన్నపట్టణములో నెలకు రు.500ల జీతముమీద బనిసేసినాడు. మాతండ్రికాలములో మాసంపాదనంతయు సతికిపోయినది.మాయమ్మకు దినుటకు దిండికూడలేనియవస్ద గల్గినది.
   సుంద;-- అవునట నీమగడాకధయంతయు నొక సారి చెప్పియున్నాడు. లక్ష్మి చంచలగదా! బండ్లోడలు  నోడలుబండ్లునగునుగదా! అదృష్టముబాగుగనున్న నీవు మరల గొప్పదానివగుదువు.
 గంగ:--ఇజమమ్మా! జమీందారులు ఫకీరుగను ఫకీరులుజమీందారులుగను మాఱుచుండుట మనము జూచుచున్నాముగదా! దేవునిదయయున్న నైశ్వర్యమునకేమిలోప