పుట:Goopa danpatulu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

105

నూత్నజీవనము.

     అప్ప--తమకు గోపమువచ్చునేమో యని శంకించుచున్నాను. అయినను జెప్పెదవినుడు. నాభార్యగుణము చెడదీసినవాడు మీసోదరుడగు నటేశముచెట్టియే. లోకులందఱును దామే వానిని బురిగొల్పి యిట్టి ఘోరకార్యము లెన్ని యో చేయించుచుంటిరనియు నిన్నటి దుర్నీతికూడ దమరే యనియు జెప్పుకొనుచున్నారు. మీరే యాదుష్టకార్యమొనర్చినను, మిమ్మునే నేమియు జేయబూనలేదు. కాని మీవంటివారికట్టిది తగదని మాత్రము మనవి చేయదలచుకొని మిమ్మునిటకు రావించితిని.
    రామ--సామిపిళ్ళా! మీరు చాల బొరపాటు పడుచున్నారు. మాగుణము మీరుగాని లోకులుగాని కనిపెట్టియుండలేదు. లోకులుకాకులు. వారాడుమాటలకు మేముత్తర వాదులము గాము. మిమ్మంతగా గొండాడుచు మీదంపతుల నన్నివిధముల బహుకరించిన మేము, మీకెగ్గు దలతుమా? అదివట్టిమాట. రాపురమున దుష్టులెందఱో కలరు. వారిలో నెవ్వరీపని చేసిరొ కనుగొనవలసి యున్నది. నేనునామిత్రులతో మీకు సర్వవిధముల సాయపడెదను. రామ రామ! ఎంతమాటాడితిరి! నెనా? ఇట్టిపనిచేయుటా? నాభార్యలేదా? ఆమె నొరులు కొనిపోయినచో నాకెంత కష్టముగా నేనుండునో నెఱుగనా? అమ్మతోడు. నేనెట్టి పాపకార్యమును జేసి యెఱుగను.