పుట:Goopa danpatulu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
104

గోపదంపతులు.

పిసికి చంపునని యొకరును, దన యవమానము దీర్చుకొనుటకు సంభాషించును గాబోలునని కొందఱును, భార్యను వాని కప్పగించి సిగ్గులేక యింకను వానితో బ్రసంగమా యని గొందఱును, ఆగంగాబాయి నెత్తుకొనిపోయినవాడు రామయ్యకాడు కాబోలునని గొందఱును, బలువురు పలుతెఱంగుల బాషింప దొడగిరి. రామయ్య యప్పలసామిని దన మోటారుబండిలోనికి రమ్మని పిలిచెను. ఇరువురును గలసి సముద్రముటొడ్దునకు బోయిరి. అతని వెనువెంటనే కొందఱు జెట్టికాండరితో నటేశము మఱి యొక కారెక్కి బయలుదేఱెను. వారొకచోట నాగి యిట్లు ప్రసంగింప మొదలుపెట్టిరి.

   అప్ప--అయ్యా! నిన్నటిరాత్రి జరిగిన ఘోరకార్య్లముం గూర్చి వింటిరిగదా?
      రామ--విన్నాను, మిగులదు:ఖించితిని. నేటి యుదయమున నావ్యహారములు సవరించుకొను నిమిత్తము నటేశము పుచ్చుకొన్న వై.యం.సి.యే భవనాగారములోనికి వచ్చి కొంతతడవు గూర్చుంటిని. అప్పుడు మీబసకు ద్వారము వైచి యుండెను. అదేలయని యచ్చటివారినడుగ వారా వృత్తాంతమంతయు జెప్పిరి. 
    అప్ప--నిన్నటి సర్కసునకు దమరు రాలేదా?
    రామ--(అనుమానించుచు) వచ్చితిని. కాని చివర దాక నుండలేక నిద్దురకులోనై ముందుగనే బసకు బోయితిని.