పుట:Goopa danpatulu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

97

పలాయనము.

      హోయలుమీఱ నామె తీగపై నేకచక్రశకటమును బలువితముల నడిపించి యెల్లరమెప్పును గాచి లొని కేగెను. అదియే యాయయొనర్చిన కడపటి బలవినోద ప్రదర్శనము. ఆమె లోపలికేగుట గాంచి చెట్టియారుసోద లిరువువు నావలికిబోయిరి.
   గంగాబాయి తనరహస్యాగారములోనికేగి కాగితమును గలమును దీసికొని వేగముగా నొకకమ్మ యీక్రిందిరీతిని వ్రాసి భర్తయలంకారములు గల బల్లపై నుంచెను. 
    "అయ్యా! (మిమ్మిక బ్ర్రాణనాధాయని పిలువజాలను.) మీకు నాయందున్న యనుమానము నన్నెగాక మిమ్ముగూడ సర్వకాలసర్వావస్దల యందును బీడించుచుండును. మనయిద్దఱిలో నెవ్వరో యుకరు తెగిన గాని యాపీడవదలదు. మీచెట్టుబట్టి యెంతో సౌఖ్యము పొందగలననియు నెంతొగౌరవము గాంచగలననియు దలచితిని. కాని నాతలపులన్నియు నాకాశహర్య్మము లయ్యెను. నేనిక మీదండ నుండజాల. నెందోపోయెదను. నాకైమీరు వెదకవలదు. వెదకినను మీకు నేను దొరకను. మరల నీశ్వరాదేశమగునేని యెప్పుడో యెక్కడో మనము కలసికొందుము గాక. మీకు సకలసుఖములొసంగి దేవు డాశీర్వదించుగాక.

ఇట్లు నిందిరుతాలు.

గంగాబాయి."