పుట:Goopa danpatulu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
98

గోపదంపతులు.

    ఆజాబక్కనుంచి యామె సర్కసుదుస్తులు సయితము విడువక త్వరితగతిని బాణిద్వారము కడకరిగి, యందు దనకై యాత్రముతో నెదురుచూచు దున్న రామయ్యచెట్టిని గలచికొని, యచ్చట దనకైద్వారము తెఱువబడి నిలువబడియున్న మోటారుబండినెక్కెను. ఒక్కక్షణములోనే కారుకదలెను. ఈలోపుననే యప్పలసామి తమగదిలోనికి వచ్చిచూడ గంగమ్మ గన్పట్టదయ్యె. విశేషించి యతనిబల్లపై నొకకమ్మ కాన్పించెను. దానిని బ్రచలితహస్తలతో విప్పిచదివెను. అతనిగుండేలో నొక్క పాషాణపాతమైనట్టు లయ్యెను. ఆమె యిప్పుడే యేగి యుండబోలునని యూహించి పాణిద్వారము దగ్గఱకరిగి చూడ నప్పుడే సాగమొదలిడిరి. మోటారు బండియు నందు రంగస్దలాలంకారములతోయున్న గంగాబాయియు నామెచెంతనున్న మఱియొక వ్యక్తియు నతనికి గోచరించిరి. రామయ్యచెట్టి ముసుంగు వైచికొని యుండుటచే నతని నానవాలు పట్టలేకపోయెను. ఆమోటారు సర్కసుశాలనుజుట్టి పెద్దబాటకు రావలెను. ఆరాక యొకింతతడవు పట్టునని యెంచి మనకధానాయకుడు దుస్తులుమార్చుకొనకుండగనే ప్రేక్షకులేగుదారిని బరువెత్తివచ్చెను. అతని వై ఖరిజూచి సర్కసుయజమానులు, ప్రేక్షకులు, నెల్లవా రాశ్చర్యపడిరి. కాని యతడు సింహద్వారము చెంతకు బోయిచూడ, వాయువేగమున మోటారుబండి సాలదాటి పోవుచుండెను. అతడందాసీనులైయున్న వారి నించుకంతయు గుర్తింపజాలకుండెను.