పుట:Goopa danpatulu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

95

పలాయనము.

యించుకొనిరి. కొందఱు చెట్టియార్లతనికిని గంగాబాయు కిని గాంచనపాత్రల నొసంగ సమజట్టిరి, కావున నాటి ప్రదర్శనము మిగుల దర్శనీయమై యుండును. సాల యంతయు జూపఱులతో గ్రిక్కిరిసిపోయెనుల్ అప్పసామి తనకుగల యనుమానబాధ లోనడచుకొని, లేని యుత్సాహముం దెచ్చుకొని తానొనర్చు వింతసాముబరులెల్ల మనోహరలీల గావించెను. అతడు కొందఱు యువకులతో, జేయుపనులు ముగిసిన తోడ నే యప్పటి హైకోర్టున్యాయాధిపతులలో నొకడగు నొక మహమ్మదీయుడు పౌరులకోరికపై సామిపిళ్లం గొనియాడుచు గొన్నిమాటలాడి యతనికి 'ప్రొఫెసర్ ' బిరుదు నొసంగెను. ఆబిరుదచిహ్నముగా నున్నతోగ్యోగులలో గొందరికి చేవ్రార్లచే నొప్పు నొక యోగ్యగా పత్ర్రముగూడ నతినికిచ్చెను.

   ఆవల దంపతులు కఓసిచేయు సాముబనులు వచ్చెను. ఒక్కొక 'ఫీట్ ' నుండియున్నప్పుడు సభ్యులు జదివానవలె జప్పటులు గురియించుచు వచ్చిరి. ఆవింతపనులన్నియు ముగిసిన తర్వాత వర్తకసంఘమువారు స్వర్ణపాత్రలను బహుమానము లుగా నిచ్చి యాదంపతుల గౌరవించిరి. భర్తతో గలసి చేయు గరిడీల సమయమున గంగమ్మ గులాబీపూవు ధరించి, రంగస్దలమునకు రాలేదు. రామయ్యసెట్టి మనస్సు చివుక్కుమనెను. పదివేల విలువగల రత్నాలదండయు వృధయేయగునా యని యతడు భయపడుచుండెను. అతనిమనస్సు మనస్సులోలేదు. గడియగడియ కావలికిబోయి వచ్చి కూర్చుండు