పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సామ్రాజ్యాభిషేకము

305

ఇంటికివెళ్ళి, ఆ సాయంకాలం స్నానంచేసి సంధ్యానుష్టానాలు తీర్చి తండ్రితో, తాతగారితో భోజనం చేసినాడు.

తాతగారు పెదఅక్కినప్రగడ, మనుమని విషయమంతా తెలిసికొన్నప్పుడు తన తెలివితక్కువకు ఎంతైనా చింతపడుతూ ఉండగా, చినఅక్కిన తాతగారిని చూచి “తాతయ్యగారూ! మీరేకాదు, ఎంతమందైనా మేము నిజంగా దొంగలము అయిపోయామనే భయపడినారు. తరువాత మేముకాకతీయ రాజ్యానికి విరోధుల్ని హతమారుస్తూ వుండడముచూచి మా చరిత్ర అర్థం కాక ఆశ్చర్యపడుతూ ఉండేవారు” అని నవ్వుతూ అన్నాడు.

తాత: నాయనా! పెద్దవాడిని, లోకంలో తెల్ల గాఉన్నవి పాలు నల్లగా ఉన్నవి నీరు అని నమ్మేవాణ్ణి. అందుచేత అలా బాధపడ్డాను.

ఆ రాత్రి శయనమందిరమునకు చినఅక్కిన భార్య సౌందర్యనిధిలా వచ్చింది. దంపతుల అన్యోన్యసల్లాపాలలో అక్కిన “రాచకార్యాలేమిటి చెప్పవూ?” అని నవ్వుచూ ప్రశ్నించెను.

భార్య: మా అన్నగారు అలా దిగాలుపడి ఉంటున్నారు. అన్నాంబికాదేవి తండ్రితో ఆదవోని వెళ్ళలేక వెళ్ళింది. నాకూ ఆ రాజకుమారికి ఎంతో స్నేహం కలిసింది.

భర్త: అంటే నీ ఉద్దేశం?

భార్య: ఏమిటా? మీ ఉద్దేశమేమిటో నాతో చెప్పారుగనుకనా? నా ఉద్దేశం మీతో చెప్పటానికి? అనుచు ఆమె పకపక నవ్వింది.

అక్కిన: “దొంగపిల్లా! నాతో వేళాకోళం చేస్తావా? నీ పని పడతా ఉండు” అనుచుండగా ఆమె పకపకమంటూ పరుగెత్తింది. అత డామె వెనుక పరుగిడినాడు.

3

రుద్రదేవి తన భర్తను తానే వరించెను. ముమ్మడమ్మకు చాళుక్య ప్రభువు అంటే ప్రేమ కుదిరిఉండాలి. భార్యాభర్తలిద్దరూ తోడికోడళ్ళయినారు. చాళుక్య వీరభద్రుడు చక్రవర్తి అవుతాడా? ఇకముందుకూడా రుద్రదేవి పురుషవేషంతోనే ఉంటుందా? ఈలా లోకమంతా విచిత్రముగా చెప్పుకుంటున్నది.

ఒక శుభముహూర్తమున పేరోలగంలో శివదేవయ్యమంత్రి సభ్యులందరితోనూ “శ్రీ రుద్రదేవితప్ప ఈ కాకతీయ మహారాజ్యానికి చక్రవర్తులు ఇంకొకరు కారు. వారికి పుత్రులు ఉద్భవించి రాజ్యార్హత పొందేవరకు రుద్రదేవ చక్రవర్తులే రాజ్యం చేస్తారు. చాళుక్య వీరభద్రమహారాజు ఈ విషయం అంతకూ తమ అనుమతిని దయచేయించారు. వివాహముహూర్తము కార్తాంతికులు పెట్టు