పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

266

గోన గన్నా రెడ్డి

చౌండ: బాగుంది మహారాజా! బాగుంది. అందుకనే మీరుగజదొంగలలోమేటి.

4

ఆ శకటాగ్నిమహాస్త్ర ప్రయోగంవల్ల యాదవుని సైన్యాలు ఏబదివేల వరకు నాశనం అయిపోయాయి. యాదవుడు కాలాగ్నిరుద్రుడై ఆంధ్రులను కాలి క్రింద పురుగులుగా రాచివేద్దామన్నంత కోపం పొందినాడు. అయినా ఏమి చేయగలడు? ఇన్ని లక్షల సైన్యాలతో బయలుదేరికూడా ఆంధ్రుల ప్రతాపం ముందర అడుగడుక్కు పరాభవం పొందుతూనే ఉన్నాడు. అయినా పట్టుదలతో ముందుకు సాగుతూనే ఉన్నాడు.

ఆంధ్రులతో యుద్ధం నల్లేరుమీద బండిపోకడ అని అతడు ఎప్పుడూ అనుకోలేదు. అందుకనే ఏడెనిమిది వర్షాలు నిరంతరకృషిచేసి ఎనిమిది లక్షల సైన్యము, ఇరువదికోట్ల ధనము ప్రోగుచేసినాడు. ఆంధ్రులు చక్రవర్తులు, యాదవులు మహారాజులు మాత్రము. అనేక నదీవరద ప్రవాహసహితమై సస్యపూరితయై రత్నగర్భయైన ఆంధ్రమహాభూమి, చుట్టుప్రక్కల నున్న రాజుల కెప్పుడూ కన్నెఱ్ఱకు కారణమవుతూనే ఉండెను.

కాని ఆంధ్రులు మొక్కవోని మగటిమికల వీరులు. వాయువునైన అరచేత బట్టగల పరాక్రమవంతులు, శేముషీసంపన్నులు, విద్యాపూర్ణులు, యుగ యుగాలనుండీ ఆంధ్రులు సర్వదేశాలకు మకుటాయమానులై ఉన్నారు.

పరరాజ్యాలవారు ఆంధ్రదేశం ఆక్రమించుకొందామని ఎన్నిమార్లు ప్రయత్నం చేయలేదు? తొలుత వారు విజయాలు సాధించినా, తర్వాత ఆంధ్రులచే పరాభవం పొందారు.

తాను మాత్రం రాష్ట్రకూటులకన్న, హోయసలులకన్న, భల్లాణుల కన్న గొప్పవాడా? తన తాతలు యుద్ధాలు చేశారు, నెగ్గారు, ఓడిపోయారు. యుద్ధం చేయడమే రాచబిడ్డలవృత్తి. యుద్ధవిజయమే రాచవారి గౌరవము. యుద్ధము పెద్దవేట. వేటలేనివాడు నరమాంస భక్షకములూ, ద్వాదశ కాటకములలో ఒకటి అయిన అరణ్య మృగములు, మానవులకు భరింపలేనట్లే ఎక్కువయుద్ధాలు లేనినాడు మానవధర్మము కాలకూటవిషంలా పెరిగిపోతుంది అని మహదేవరాజు అనుకున్నాడు.

తన తండ్రి కృష్ణభూపతి దేవగిరి యాదవులకు తలవంపులు తెచ్చాడు. గణపతిదేవునకు భయపడి స్నేహమని తన రాజ్యం ఎల్లాగో దక్కించుకొన్నాడు. తాను యాదవుల ప్రతిభ శ్రీ మాధవుని కాలంలోవలె అప్రతిమాన కాంతితో వెలిగింపజేయలేనినాడు, తాను యాదవుడై తే నేమి, గాదవుడై తేనేమి? ఇంతకన్న అదను తన కెలా దొరుకుతుంది? ఆడది రాజ్యానికి రావడమా అని సామంతులంతా తిరగబడుచున్నారు. ఆంధ్ర