పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణవేణి

241

మల్లిక: అదీ నిజమేనండీ! నాయనగారు తాముచేసేపనికి విచారిస్తున్నామనీ, అమ్మాయి ఇష్టములేకుండా ఏపనీ చేయమనీ, రుద్రదేవ చక్రవర్తికి తా మిక ముందు నమ్మకమయిన బంటుగా ఉండి వారిఆజ్ఞ శిరసావహిస్తామనీ తెలుపుతూ ఓరుగల్లు రాయబారం పంపారని నిన్న ఇక్కడకు వేగు వచ్చింది.

విశా: మల్లికా! అమ్మగారినీ, నాన్నగారినీ చూడాలని ఉంది. అయినా మహాదేవరాజు ఓరుగల్లుమీదకు దండెత్తి వస్తున్నాడట. ఈ సమయంలో శ్రీ రుద్రదేవి గారిదగ్గర నేను ఉండా లనిపిస్తున్నది.

మల్లిక: మంచిది రాజకుమారీ!

మల్లిక లేచివెళ్ళి తన ప్రక్కమీద పండుకొని, అన్నాంబిక అన్నమాటలే ఆలోచించుకొనుచు కళ్ళు తెరిచియే ఉన్నది.

అన్నాంబిక హృదయమా, గన్నారెడ్డిప్రభువుపై లగ్నమైనది. అందులకే కదా రుద్రదేవి చక్రవర్తిని ఆలోచనపై ఈ బాలిక వేషాలతో వా రిరువురు గన్నారెడ్డిప్రభువుకడకు వచ్చినది. మన మనోరథాలు నెరవేరుచున్నంత వరకూ తికమక లేమీ లేక ఆనందము ప్రసరించుచుండును. ఏమాత్రము తారుమారైనను మనుష్యుని దినచర్యలో ఎన్నిమార్పులో వచ్చునుగదా! అన్నాంబిక, మల్లిక వెళ్ళగానే బిడ్డవలె నిద్రపోయెను.