Jump to content

పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/81

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అవయవాలు అదరడం

అప్పుడప్పుడు అవయవాలు అదరడం అనేది పశుపక్ష్యాదులలోనూ, మనుష్యులలోను కనిపిస్తుంది. మనుష్యులలో కనిపించే యీ అదరడానికి అదిరే ప్రదేశాన్ని బట్టి యిలాగ శుభాశుభాలు చెప్పుకుంటారు.

కుడిప్రక్మ అదిరిన మేలు, ఎడమ ప్రక్క మధ్యను ఫలం నడినెత్తిన మృష్ణాన్నం, నొసట మేలు, కుడిచెంప రాజభయం, ఎడమచేయి ఉద్యోగం, రెండు కన్నులూ అదిరిన మేలు, ముక్కు రోగం, పైపెదవి కలహం, క్రింది పెదవి భోజన సౌఖ్యం, గడ్డం లాభం, కుడిచెక్కిలి ధనలాభం, ఎడమ చెక్కిలి దొంగల భయం, కుడి భుజం సంభోగం, ఎడమ భుజం కీడు, రొమ్ము ధనలాభం, చేతులు వాహన లాభం, అరచేయి సంతానం, కుడితొడ రాజభయం,మోకాళ్ళు జాడ్యం, మీగాళ్లు ధాన్య్హ లాభం, అరికాళ్లు సౌఖ్యం.

ఆడవాళ్ళకు కుడికన్నదిరినా, మగవారికి ఎడమకన్నదిరినా అశుభ మంటారు. మగవారికి కుడికన్ను, ఆడవారికి ఎడమకన్ను అదరడం శుభం.

ఈ అవయవాలు అదరడాన్ని విఅద్యశాస్త్రజ్ఞలు పైత్యం ఎక్కువవ్చడంవల్ల, నరాల బలహీనతవల్ల జరిగే పని మాత్రమే అని చెబుతారు.

గ్రామదేవతలు :

ఆంధ్రదేశంలో విష్ఠ్యాలయంగాని శివాలయంగాని లేని ఊరుండరు. ఊరిలోని గ్రామదేవతే వారి ఊరును రోగాలబారినుండి, క్షామాలనుండీ కాపాడుతుందనీ, ఇష్ఠకామ్యాలు నెరవేరుస్తుందనీ జానపదుల విశ్వాసము. అందుకే ఆమను ముక్కుకుంటూ ఏటేటా ఫెళ్ళుమని ఉత్సవాలు జరిపిస్తుంటారు. ఈ ఉత్సవాలనే జాతర్లంటారు. ఈ అమ్మవార్ల ఆరాధనా పద్ధతేవేరు. త్రిమూర్తులలో శానవశాన బ్రహ్మకు ఎలాగుపూజలేదు. ఇక శివకేశవుల ఆరాధన సాత్వికారాధన. వీరికి విఅవేద్యం పళ్ళూ, ఫలహారాలు చాలు. కాని యీ గ్రామదేవతల ఆరాధన క్షుద్రదేవతారాధన. నరుని దగ్గరనుంచి కోడివరకూ బలికోరతాయి.