పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/82

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆదిమ మానవుడు ప్రకృతి శక్తులతోపాటు చెట్టునీ, పుట్టనీ, రాయినీ రప్పనీ కూడా ఆరాధింఛేవాడు. భూగర్భంలోనూ, జలగర్భంలోనూ దొరికినకొన్ని రాళ్ళు గ్రామదేవతలుగా వెలశాయి. ఈ యోగం కూడా అన్ని రాళ్ళకూ పట్టదు - కొన్ని రాళ్ళకే. అందుకే స్థలభోగం శిలాభోగం అంటూంటారు పెద్ద్దలు. ఆంధ్రదేశంలో ఎక్కడచూసినా పోతురాజులూ, పోలేరమ్మలూ, కోకొల్లలు (ఇవి మన మంత్రులు పాతిన శంకుస్థాపన రాళ్ళంటారనుకోండి కొందరు రాజకీయ్ చతురులు).

ఇంతకీ యీగ్రామదేవతలు ఎవరూ అనేది ఆలోచిస్తే ప్రతి చిన్నదేవత వెనుకా కూడా ఒక్ పెద్ద కధ ఉంటుంది. సాధరణంగా ఆ వూరికోసం ఏదైనా త్యాగం చేసిన పేరంటాలో, బ్రతికుండగా ఏదైనా అతీత శక్తులు ప్రదర్శించిన స్త్రీయో, అత్తమామల ఆరళ్ళతోనో, భర్త పోరుతోనో, బలవంతాన చనిపోయిన పడుచో అయివుంటుంది.

ఇలాంటిదే రాయలసీమలో అనంతపురం జిల్లాలో బుక్కరాయసముద్రం దగర ముసలమ్మ. బుక్కరాయ చెరువు కట్టతెగింది. ఊరు మునిగిపోయే ప్రమాదమొచ్చింది. ఆవూరిలోని ముసలమ్మ అనే వనితను బలియిస్తే తన్నివారణ జరుగుతుందని ఊరి పోలేరమ్మ పూని పలికిందట. గ్రామ శ్రేయస్సుకోసం నవయవ్వనవతి, సుందరాంగియైన ముసలమ్మ ప్రాణప్రదులైన భర్తను. అత్త,ఆ,అ;అమి విడిచి అందులో దుమికి ఆత్మార్పణ ఛేసింది. కట్టమంచి రామలింగారెడ్డిగారి 'ముసలమ్మ మరణం ' కావ్యం యిదే. ఈ ముసలమ్మ అందాల్నివర్ణిస్తూ పసుపు పూసుకు స్నానమాడేటప్పుడు 'తలమీదచెట్లు కురిసిన లలితసుమపరాగమున వెలయు లతిక ' వలె ఉన్నదంటారు. ఆత్మబలిదానం యివ్వాఅనికి జల ప్రవేశం చేసేటప్పుడు-

                 "జ్వలదగ్ని శిఖలపై చెలనవ్వుతోబోవు
                   ధాత్రీ మహాదేవి తనయయనగా"
                   

అని వర్ణించి తెలుగు సాహితీ చరిత్రలో ఆమెస్థానాన్నిఅజరామరం చేశాడు. ఇలా గ్రామాన్ని కాపాడిన తల్లిగా, అక్కడ గ్రామదేవతగా వెలసి పూజలందుకొంటుంది.