పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/70

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వీని నిర్చహణలో మినిషికి నియమనిష్టలు, క్రమశిక్షణ్, ఏకాగ్రత అలవడతాయి. సంతానంకోసం, సంపదకోసం, ధానాధ్యులు చేసే పుత్రకామేష్ఠి, రాజసూయం, అశ్వమేధం వంటి క్రతువులకు, అజ్ఞ యాగాదులకు యివి ప్రతిరూపాలు. సామాన్యులకుకూడా ఆఫలంమీద కోరికుంటుంది గదా! అందుకని అవి అతని స్థాయికి సరిపడా సరళం చేయండి, యిలా వ్రతాల రూపంలో అందించబడ్డాయి. ఈ అణుయుగంలో కూడా యిప్పటికీ జానపదులు పల్లెలలో యీ వ్రతాలను ఎంతో వేదుకగా చేసుకుంటూ ఆయాదేవతల ఆశీర్వాదం పొందుతున్నట్టు అనుణ్భూతిని పొందుతుండడం గమనార్హం.

  • "ఈ వ్రతములందు నిగూఢమైన మొదటి ధర్మము వితరణ. వ్రతంపేర కలిగినంతలో పండో, పత్రమో, వస్తువో, వస్త్రమో, ధనమో, ధాన్యమో, భొజనమో ఇతరులకు అందజేయుట అనునది ముఖ్యలక్షణముగా కనిపించుట. దానములేని వ్రతము లేనేలేదు. రెండవ ప్రయోజనము భగవచ్చక్తి ప్రార్ధనాశీలత". అందుకే వ్రతకధలలో ఎత్తిమరీ చెబుతారు - "శక్తి లోపమైనను రక్తిలోపముకారాదు. కధలోపమైనా వ్రతలోపము కారాదు" అని.
    • "నోములు, వ్రతాలవలన కలిగే లాభాలు ఏమిటి అని ఆలోచిస్తే మొదట నలుగురూ చేరి సంతోషముగా కాలం గదుపుట అని చెప్పవచ్చు. బీజమునందు వృక్ష గుణధర్మములన్నియు గర్బితములై ఉన్నట్లు ఈ వ్రతములందు దయ, సత్యం శౌచం, నీతి, ఆరోగ్యం, మోక్షం మొదలగు సంప్రదాయములన్నియు గర్భితమై యున్నవి".

వి శ్వా సా లు :

చంద్రుడి దగ్గరగుడికడితే దూరపు వానలనీ, దూరంగా గుడికడితే దగ్గరవానలుపడతాయనె జానపదుల విశ్వాసం. గుడి అంటే చంద్రబింబానికి కొంత దూరంలో అప్పుడప్పుడు చుట్టూ చక్రంలా కనబడే కాంతివలయం.


  • విజ్ఞాన సర్వస్వము, సంసృతి పుట. 908,9010
    • ఆంధ్రుల జానపద విజ్ఞానము పుట 315, డాక్టర్ ఆర్.వి.ఎస్.సుందరం.