పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/494

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈరోజు నవవధువులు ఉపవాసముండి దేవునిగుళ్ళో కందనిగల పసుపుచెట్లూ అర్పణగా యిస్తారు పిల్లలు తొందరగా కలగాలని, దేఫునిగుడినందు రాత్రిజ్వాలాతోరణంకడతారు. జ్వాలాతోరణంఅంటే వెండిరాటలు దూరంగవాతి.ఆరెండింటినీకలుపుతూ పైన వట్టిగడ్డి(ఎండుగడ్డి)వెంటుతోకట్టి, దానిపై ఒకమోపువట్టిగడ్ది వ్రేలాడదీస్తారు. దేవుడు ఊరు తిరిగి రాగానే ఆపల్లకీ దానిక్రింద మూడుసార్లు అటూయిటూత్రిప్పి కాగడాతో ఆమోపుకు అగ్నిముట్టిస్తారు. అది అంటుకుపోతుంటే అందరూ ఎగబడి లాగేసుకుంటారు. ఆగడ్ది పశువులకువేస్తే పాలెక్కువవిస్తాయని విశ్వాసం.

     ఈ జ్వాలాతోరణానికిముందు పల్లజనులలో యువకులు మర్రిచెట్టు ఊడలుతెచ్చి ఏవీధివారు ఆవీధిజట్టుగాఏర్పడి, ఒకవైపు ఒకవీధివారూ, రెండోవైపు మరోవీధివారుఒ లాగుతూ ఉంటారు. ఆ ఊడ ఏవైపుకు లాక్కూపోతే ఆవీధివారు గెలిచినట్టు. తోరణం వెలిగించేవరకూ గ్రామాల్లో బలప్రదర్శనకు సంబందించిన కాలక్షేపంక్రీడ యిది.
  ఇలాగ ఈ తిధులకు పుణ్యం, పురుషార్ధం అపాదించి ఆయాకార్యక్రమాలు నిర్వహింపజేసేవారు.  వీనికి పైకి భక్తిపరంగానో, వేడుకపరంగానో అర్ధాలుచెప్పినా ప్రతిదానివెనుకా వైద్యం, ఆరోగ్యం శుచి, శుభ్రత, ఆప్యాయత, మమతవంటి ఏదో ఒక శాస్త్రీయభావన యిమిడివుంటుంది.  శాస్త్రసత్యాన్ని ప్రత్యక్షంగాచ్ఫెబితే సామాన్యుడు స్పందించకపోవచ్చు.  అరనినాడికి సరిపడినరీతిలో యిలా పరోక్షంగా ఆచరింపచెయ్యడం వీనిపరమార్ధం. ఇదే కాంతాసమ్మితోపదేశమంటే