పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/493

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రద్దలతో తెల్లవస్రుజామున స్నానంచేసి దీపారాధనచేసి ఉపవసించిన వారికి బొందితో కైలాసంవస్తుందని కార్తీకపురాణంలో చెప్పబడింది. ఒక అత్తగారు కార్తీకమాసమంతా ప్రతిరోజూ స్నానానికి కస్లువకువెళ్ళి దీపారాధన చేసివచ్చేది. కాని కోడలిని రస్నిచ్చేదికాదట. (ఆమెకెక్కడ పుణ్యం వచ్చేస్తుందో అని) కోడలు అత్తగారువెళ్ళగానే యింటివద్దే స్నానంచేసి నిష్థతో దీపారాధనచేసి అత్తగారికితెలిస్తే కోప్పడుతుందని కనిపిం?చకుండా పేడతట్టమూతపేట్టేదట. రోజంతా మనసులో దైవాన్ని స్మరిస్తూ ఉపవసించేది. ఆమెపేరే పోలమ్మ. చివరిరోజున ఈ అమావాస్యనాడు దీపారాధన పూర్తికాగానే అత్తగారు యింటికి వచ్చేసరికి దేవదూతలు పోలమ్మను పూలవిమానంలో ఎక్కించుకుని ఆకాశమార్గాన స్వర్గానికి త్తెసుకెళుతున్నారట. అత్తగారూఅశ్చర్యపోయింది. తనకు రావలసింది ఆమెకొచ్చిందని! అందుకే వేమన్నగారన్నారు చిత్తశుద్దిలేని శివపూజలేలయా విశ్వదాపిరామ వినురవేమ“ అని

      కా ర్తీ క పూ ర్ణి మ
  కార్తీకంలో అన్నిరోజులూ దైవారాధనకు పుణ్యదినములే. చాలా మం ది యీ నెలరోజులూ వేకువజామునలేచి ఉషస్సుగడియలురాకుండా దగ్గరున్న కాలువలోస్నానంచేసి అరటిదొన్నెలలో ఆవునేతిలోముంచిన వత్తులు వెలిగించి కాలువలో వదిలిపెడతారు.
    ఆసంధ్య చీకట్లో అవి చూస్తుంటే కాలువలో నక్షత్రాలు ప్రయాణిస్తున్నట్లు కనులవిందుగా కనిపిస్తాయి. ఇండ్లదగ్గర సందకాడ (సాయంసంధ్యకు జానపదులు వాడే పదం యిది) ఆకాశదీపాలు పెడతారు. వాకిట్లో ఒకరాటకు పుల్లీకట్టి, దానిలోచి ఒకత్రాడులాగి, ఆత్రాడుకు ఒకచివర చుట్టూ చిన్నచిన్న చిల్లులుగల యిత్తడిబరిణెలో ప్రమిదపెట్టి దానిలో నూనె, వత్తులువేసి వెలిగించి, త్రాడు రెండవచివర పట్టుకులాగితే ఆబరిణెపైకి రాటచివరికిపోతుంది. అక్కడభరిణకన్నాలలో నుంచిమినుకుమినుకుమంటూ వెలుతురుకనిపిస్తుంటే అదో చిన్న నక్షత్ర మండలంలా ఉంటుంది. ఈభరిణనే ఆకాశదీపమంటారు. ఇవన్నీ పుణ్యసంపాదన ప్రక్రియలలో భాగాలే.