ఈ పుటను అచ్చుదిద్దలేదు
అవయంబిఉ నొప్పెడు అశ్రువుపూరంబు
లన సేలయేరుల నలరెడు దాని"
అని సెలయేళ్ళ ప్రవాహాన్ని పర్వతునియొక్క ఆనంద భాష్పాలుగా అభివర్ణిస్తాడు.
జానపదులు తమ యిళ్ళల్లో అవరయినాచనిపోతే వారితాలూకు చేష్టలూ, మాటలూ, వారితోపొందిన అనుభూతులూ, వరి మృతితో కలిగిన వెలితి తలుచుకు తలుచుకు ఏడుస్తారు. సీత కనిపించకపోయేసరికి ఆమె చచ్చిపోయి ఉంటుందని భావించిన రామునిచేతకూడా అలాగే విలపింపజేస్తాడు - మగవాడుగనుక కొంచెం సున్నితంగా -
ఇది మహారణ్యమై యిప్పుడు తోచె
ఇది పర్ణశాలయై యిప్పుడు తోచె
ఇదినాకు తపమని యిప్పుడుఇ తోచె
చల్లని ముఖదీప్తి చంద్రుని కిచ్చి
తెల్లని నగవు చంద్రికలకు నిచ్చి
చెలువంపు పలుకుల చిలుకల కిచ్చి
నిన్ను దైవము మ్రింగెనే నేడు సీత"!
ఇలాగ తెలుగు జానపదులభావాలూ, రీతులూ, ఆచారాలూ, అలవాట్లు, పడికట్లు అన్నీ జతచేసి సీతను తెలుగు జానపదుల ఆడబడుచుగానూ, రాముని తెలుగు జానపదుల దేవుడుగానూ తీర్చిదిద్ది రామాయణాన్ని తెలుగు జానపదుల హృదయాలలో చిరిస్థాయిగా నిలబెట్టాడు బుద్ధారెడ్డి. తెలుగుపల్లెలలో పెటపేటకూ కనిపించే రామాలయాలు, ఇంటింటా వినిపించే సీతారాములపేర్లు ఈ జానపద రామాయణ ప్రభావమే. * * * *