పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/274

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బోడెమ్మల వేషాలు

        ముఖాన విభూతిరేఖలతొ మెడలో రుద్రాక్షమాలలతొ తెల్లని మల్లు రేకు కట్టుకుని, తలగుండుచేయించుకుని కప్పెట్టుకున్నట్లు చెందు నెత్తిమీదనుండి దింపి, చెంబు చేత్తొపట్టుకుని  'కస్తూరిరంగా' అంటూ పాడుకుంటూవచ్చి ప్రజల్నిచూసి అందులోఒకర్ని చాలా తెలిసినట్టు 'ఏమండోయ్: క్షేమంగా ఉన్నారా ? అయ్యో మేమేనండీ! మమ్మల్నెప్పుడూ చూదనట్టు అలా చూస్తున్నారేమిటి? నాపేరు తులసీభాయండీ - ఈమపేరు సౌభాగ్యం.  మీరేంతా క్షేమంగావున్నారా?
    ఇదిగో మేం నిక్షేపంలాగున్నాం, కాకపొతే భర్తపొవడం గుండు గీయించుకొవడంతప్ప " అని చిన్న ఏడుపుతో ముక్కుచీదేసి తనబర్త ఉన్నరోజుల్లోని తన అందాన్ని గూర్చిచెబుతూ "ఆరోజుల్లొ నేను నగలు ధరించి నడివీధిలో నడుస్తుంటే అందరూ అదిగొ వరలక్షి వెళుతుందిరోయ్ అని వెంటబడేవారు.  ఆయనమట్తుకాయనో భాగాయి! నా ఐశ్వరంఅంతా నివ్వేనోయ్ - అంటూ తెగమురిసిపోయేవారు.  ఇప్పుడేముందినాయనా 'బుజమ్మీదాకొంగు గొవిందారామ బుర్రపైకొచ్చింది  గొవిందా ' అంటూ గొవిందనామాలు పాడి, 'మాపంతులుగారు గంగలో స్నానానికి దిగి మునిగిపోయారు  నాయనా - ఆయనున్నాళ్ళూ నేనే తిరిగేదాన్ని వీధులంట.  ఇప్పుడిల్లుకదిలె ఆవకాశమేలేదు. ఎక్కెవాళ్ళూ దిగేవాళ్ళూ, ఎక్కేవాళ్ళూ దిగేవాళ్ళూ - ఏమిటి అలా చూస్తారు ! ఆ ఎక్కేవీ దిగేవీ మాగుమ్మమ్మెట్లుండె గుమ్మమ్మెట్లు అటు పంతులుగారి స్నేహితులూ, ఇటు నాస్నేహితులూను.  ఎవరిని మాత్రం కాదనగల్ను!" అని కొంచెం శృంగారం ముదరపాలులో చెబుతుంటే చుట్టూచేరిన జనం గొల్లున నవ్వుతుంటారు.  "మాకు డబ్బులేక యిలా దేశాలంటబడి తిరగడంలేదునాయనా! గుమ్మడికాయంత బంగారం కుక్కముట్టుకుంటే పెంటమీదపారేశాం తెలుసా! ఏదో మిమ్మల్ని నలుగుర్నీ చూసిపొదామని యిలా వచ్చేమంతే" అని బియ్యం కోసం జోలిచాపుతుంటే నవ్ఫనివాడెవ్వడు !
                         సొమయాజులు - సోమెదేవమ్మ
  శ్రోత్రియబ్రాహ్మణవేషంలో పెండికట్లతో పట్టుపంచి, గొడుగు, పంచాంగంకట్టతొ ముసలిసొమయాజులూ - బాపనకచ్చావేసుకొని పడుచు