పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/275

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సోమెదేవమ్మా వయస్సులోనున్నశిష్యుడూ వెంటరాగా కూరగాలపేర్లు వేదంలోపనసలాగ చదువుతూవచ్చి, బ్రాహ్మనత్వం తొణికిసలాడే 'ష 'లు ఎక్కువగా వాడుతూ వినోదాన్ని అందిస్తారు. శిష్యుడివైపు ఓరగా చూస్తున్న సోమదేవమ్మను సొమయాజులు "ఒషేవ్ సోమెదేవీ! నేను ముసలివాణ్ణని అలా ప్రక్కచూపులుచూస్రే నీకు పాపంఘటిస్తుందే" అంటే, సోమిదేవమ్మ "అవేంపాపిష్టి మాటలండీ అన్యాయంగానూ ? ఇదిగో - నావల్ల పాపంవుంటే నాపసుపూకుంకుమేపోతుంది, మీవల్ల పాపంవుంటే మీరేపోతారు" అని పెట్టే ఒట్టుకి ఫక్కున నవ్వకుండా ఎలా వుండగలం!

   శిష్యుడు 'గిరువుగారూ! అమ్మగారికి ఆరోమాసం కడుపులాగుందండీ" అంటుంటే సోమయాజులు 'నెను కాశీకెళ్ళి ఆరు సంవత్సరాలయిందిగదా! ఈఆరు సంవత్సరాలనుంచీ అక్కడ నేను చేస్తున్న తపస్సువల్ల యిక్కడ మాసోమిదేవికడుపు ఫలింఛిందన్నమాట" అంటాడు.
  అప్పుడు "మరి బారసాలపీటలమీద మీరేకూర్చుంటారా గురువుగారూ!" అంటే 'తప్పేమిషిరా?' అంటాడు.  ఇలాంటి చతురసంభాషణలతో కడుపుబ్బ నవ్విస్తాయి యీవేషాలు.
                      భ ట్రా జు ల వే షం
   చేతిలో విసనకర్ర, మెడలొ జందెం, నుదుట కుంకుమబొట్టు, భుజంమీద తుండు, తలపాగాతో "విజయీభవ విజయీభవ " విజయీ దిగ్విజయీభవ, దరిసింహాసనమై, నభంబు గొడుగై, తద్దేవతల్ భృత్యులై, పరమామ్నాయములెల్ల వంధిగణమై, సిరి భారామణియై, విరించిగొడుగై, పరుసన్నీగణరాజసంబు నిజమై, వర్ధిల్లు నారాయణా, జయాబిజయభవ దిగ్విజయీభవ". అంటూ నలుగురైదుగురు భట్రాజుల్లా వస్తారు.  వీరి పొగడ్తలూ, సుబాషితాలూ నిజంగా భట్రాజులే అని భ్రమింపజేస్తాయి.
  ఎదుటివారి కులాన్నిబట్టి పెద్దపెద్ద సమాసాలతో సంభోధిస్తూ ఎదుటివారు బ్రాహ్మలైతే 'త్రికాలసంధ్యాది జనహోమనిత్యతకర్మాగ్రశ్రేష్టా!హరి హర పూజావిధేయా! విజయీభవ"అనీ, - కోమటి అయితే 'వైశ్వరత్నా