పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/231

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వల్లగానీ, అలవటువల్లగానీ మధ్యమధ్య యీఊతపదాలు ప్రయోగం జరుగుతుంటుంది. గోదావరిజిల్లాలలో ఈక్రిందిపదాలు ఎక్కువగా విన బదుతుంటాయి.

                    దీని తల్లీ బొడ్డూపొక్క
                    వీడమ్మాకడుపు బంగారంగానూ
                    దేవుడు మేలుచేస్తే
                           ఏటి
                           ఏదీ
                           మరి
                           కాని
                          అయితే
                          పోగా
                          ఇకపొతే
                      దీనమ్మా మొగుడు
                      గాడిదగుడ్డు
                      అదే పోయింది లెద్దూ
                     తరవాత
                      నెచెప్పేదేటంటే

ఇందులొ ఏటీ, మరి, తరవాత, ఇకపోతే, పోగా, చెప్పేదేటంటే అనెవి వేదికలమీద నట్టుతూమాట్లాడే వారి ఉపన్యాసాల్లోకూ'డా తరచుగా వింటుం టాం. వీటికి అర్ధంపర్ధం ఉండదక్కడ - అలవాటుమా'టలంతే - దీనిని ఇంగ్లీషులొ 'మేనరిజమ్స్ ' అంటారు.

శ్రీ నేదునూరి గంగాధరంగారు అనేకశ్రమదమాదులకోర్చి, జీవితమంతాధారపోసి, పలుప్రాంతాలుతిరిగి చాలాభాగంసేకరించి, లిఖించి వారి కుటీరంలో భద్రపరచి పరమపదించారు. చీకటిగదిలోమ్రగ్గుతున్న ఈ సాహిత్యం చదలపాలుకాకుండా రక్షించుకోవడం తెలుగుజాతి కర్తవ్యం.