పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/230

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నీమీద ఒట్టు
నాబిడ్డల తొడు
దేవునిమీద ఒట్టు
(ప్రమాణ్ంచేసేటప్పుడు కొందరు నెత్తిమీదచెయ్యివేసి మరీ
ఒట్టుపెడతారు) పదిమందికట్తినయింటిక్రింఉండి చబు
తున్నానీమాట
అబద్దమైతే పురుగులబడిఒతాను
ఇక అజ్ఞాపనగాపెట్టే ఒట్లున్నాయి -
నామాటవినకుంటే నీప్రాణాలుతియ్యకపోతే ఒట్టు
ఇప్పుడునువ్వుయిల్లుకదిలవంటే నన్నుచంపుకుతిన్నట్టే.

ఇవికూడా పటుత్వం కలిగినవేగాని కొందరు మాటిమాటికీ ఒట్టంటుం
టారు. అది మాత్రం ఒట్టి అలవాటు మాట.

                              దీ వె న లు

              చిన్నవాళ్ళుఎవరైన నమస్కారంచేస్తే పెద్దవాల్లు యిలా
ఆశీర్వదిస్తుంటారు -

                 సుఖంగా నూరేళ్ళుబ్రతుకు
                దేవుడు నీకు మేలుచేస్తాడు
                నీ మంగళసూత్రం చల్లగుండాలి (ఆడవారైతే)
               ఒకింటివాదివై పిల్లా మేకాతోచల్లగాఉండాలి (మగవాడైతే)
               నీయమ్మకడుపు చల్లగుండా -
               నా ఆయుష్సుకూడా పోసుకు బ్రతుకు
                నీకు జయంకలగాలి.
               ఏదైనా ప్రయాణంవెళ్ళేటప్పుడు వెళ్ళొస్తానని చెబితే-
              'శుభం ' అని కొందరు, "క్షేమంగావెళ్ళి లాభంగారా" అని
              కొందరూ దీవిస్తుంటారు.

                              ఊత పదాలు

        సాధారణంగా మాట్లాడేటప్పుడు జానపదులమాటల్లో ఊతపదాలు
ఎక్కువ కనిపిస్తుంటాయి. తరువాతమాట వెంటనే స్పురణకురాకపోవడం