పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/180

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"రాముడి మీద--
 
ఏనుగు ఏనుగు నల్లన, ఏనుగు దంతం తెల్లన
ఏనుగుమీదారాముడూ, ఎంతోచక్కని దేవుడూ"
అని కోరస్ గా పాడుతుంటారు.

అలాగే సీత మీద-
'సీతమ్మ వాకిటా సిరిమల్లె చెట్తు
 సిరిమల్లె చెట్టేమొ చితకపూసింది
 చెట్టు కదలాకుండ కొమ్మవంచండి
 కొమ్మ విరగాకుండ పూలు కోయండి
 కోసినా పూలన్ని సీతకివ్వండి
 తీసుకో సీతమ్మా రాముడంపేడు
 దొడ్డి గుమ్మంలోన దొంగలున్నారు
 దాచుకో సీతమ్మ దాచుకొవమ్మ
 దాచుకోకుంటేను దోచుకుంటారు"

అని పాడతారు వీనుల విందుగా వీనివల్ల ఆ చిన్నవయసులోనే గొంతులకు శృతిజ్ఞానం అలవడుతుంది.

ఆడపిల్లలు ఇద్దరుగాని, నలుగురుగాని ఎదురుబొదురుగా నిలిచి ఒకరిఅరచేయి మొరకరిఅరచేతికి తాకిస్తూ--
"చెమ్మచెక్క చేరడేసి మొగ్గ
 అట్ల పొయ్యంగ ఆరగించంగ"

అనిపాడే పాటలో ఒక ఔషధ ప్రక్రియ ఉందట. రజస్వలకాని స్త్రీలకు చెమ్మచెట్టుచెక్క, దాని పువ్వులు, మొగ్గ అట్లపిండితో రుబ్బి ఆ అట్లు ఆరగించుట మంచి ఔషధమట.

పల్లెలలో కన్నెపిల్లలు సంక్రాంతిరోజుల్లో వీధుల్లో గుమ్మంముందు పేడతో గొబ్బిళ్ళు పెట్టి, పసుపూ కుంకుమా బొట్టుపెట్టి, బంతిపూలతో అలంకరించి తమ మనసులోనికోరికలుముడివేసి యిలా పాడుతారు.