పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/181

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"సుబ్బీ గొబ్బమ్మా సుబ్బణ్ణియావే
 తామరపువంటి తమ్ముణ్ణియ్యావే
 చేమంతీపువ్వంటి చెల్లెల్నియ్యావే
 అరటీపువ్వంటీ అత్తానియ్యావే
 మల్లపువ్వంటీ మామానివ్వవే
 బంతిపువ్వంటీ బావానియ్యావే
 మొగలీపువ్వంటీ మొగుడూనియ్యావే"
ఆటల్లో పిల్లలు 'గౌరీఅళ్ళో ' అనేది వంతగా మరో రకంపాటకూడా పాడుతారు యిలా-
గొబ్బీయల్లో గొబ్బీయల్లో గొబ్బీయల్లో....
చంద్రగిరి భామల్లార, నీలగిరి కన్యల్లారా ||గొ||
దుక్కూదుక్కూ దున్నేరట ఏమీ దుక్కూదున్నేరట
రాజాగారీ తోటాలోనా జామీదుక్కూ దున్నేరట ||గొ||
విత్తూవిత్తూ వేశారట ఏమీవిత్తూ వేశారట
రాజాగారీ తోటలోనా జామీవిత్తూ వేశారట ||గొ||
కాయాకాయా కాసిందట ఏమీకాయ కాసిందట
రాజాగారి తోటలోనా జామీకాయ కాసిందట ||గొ||
పండూపండూ పండిందట ఏమీపండూ పండిందట
రాజాగారి తోటలోనా జామీపండూ పండిందట ||గొ||
అవునాటే అక్కల్లారా! చంద్రగిరి భామల్లారా!
నీలగిరి కన్యల్లారా ! తామరగిరి మొగ్గల్లారా! ||గొ||
ఇలాగ వాళ్ళకు తెలిసినన్ని పండ్లచెట్లపేర్లు కలుపుకుంటూ పాట పెంచుకుంటూపోతారు. ఇది పిల్లలలో వృక్షశాస్త్ర విజ్ఞానాన్నీ, భావుకతనూ, కవితాశక్రిని ప్రోదిచేస్తుంది.

పిల్లలందరూ రెండుజట్లుగావిడివిడియ్యాలవారి ఆట ఆడుతుంటారు సంభాషణాపరమైన పాటతో, అందులోఒకజట్టు దూరంగానిలుచున్నఎదుటి జట్టువారితో--

"విన్నీచిన్నీ కెన్నోనెల సింగలగొరీకెన్నో నెల
 తాడిబీడికెన్నోనెల తామగిరిమొగ్గాలమ్మామొగ్గలు"