పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/144

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కా ర్టూ ను లు

శంకర్ "శంకర్స వీక్లీ" ద్వారా రాజకీయ వ్యంగ్య చిత్రాలతో దేశాన్నీ, ప్రపంచాన్నీ కూడా ఊపేశాడు. "తుగ్లక్" పత్రికా సంపాదకుడు "చో రామస్వామి" తనహాస్య వ్యంగ్య కార్టూనులతో తమిళనాట బ్రహ్మాండమైన సంచలనం సృష్టించాడు;. అప్పుడు కార్టూను బొమ్మలు లేని పత్రికలే లేవు. విషయాన్ని సూటిగా, గుండెలకు హత్తుకునేలా చెప్పేశక్తి దీనికే వుంది. ఒక చిత్రంలో ఆకాశం, నేలనుండి ఆకాశానికి ఎగిరిపోతున్న నక్షత్రాలు, ఆనక్షత్రాల పొట్టలలో ఒక్కో నిత్యావసరవస్తులు వెశాడు. ధరల పెరుగుదలను వ్యంగ్యంగా చెప్పిన కార్టూనిది.

తెలుగులో అడివి బాపిరాజు, దామెర్ల రామారావు తమతమ చిత్రాలలో ఒక రమణీయతను సృష్టించి చూపరులను ఆనందపుటలంచులకు తీసుకుపోయారు. జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి 'కరుణశ్రీ ' కి ఘంటశాల గానంతో ప్రాణంపోస్తే, వడ్డాది పాపయ్యగారు అది చిత్రాలుగా చిత్రించి దానిని పామర జనంలోకి కూడా తీసుకుపోయేరు. ఈనాడు సాహిత్యంలో ఆధునిక రీతులు అని చెప్పుకొనే వానిలో చాలవరకు చిత్రలేఖనం నుండే పుట్టుకొచ్చాయి. అందులో ముఖ్యంగా ఇంప్రషనిజం, సింబాలిజం క్యూంబిజం, సర్రిలయలిజం నిజానికి ఫిత్రలేఖనం నుండే పుట్టుకొచ్చాయి. సహజంగా చిత్రాలు స్వాభావికంగ్తా వేస్తారు. అది రియలిజం. ఉదాహరణకు దూరంగా ఉన్న ఒక అడవి చిత్రించాలంటే చెట్లు ఆకుపచ్చరంగులోనూ, నీడలు నల్లరంగులోనూ చిత్రిస్తారు. ఇది సంప్రదాయం- కాని ఇంప్రషనిజంలో ఆ చెట్లను ఎరుపురంగులోనూ, నీడలు నీలిరంగులోను చిత్రిస్తారు. కారణం -దూరానికి అడవి అలా కనిపిస్తుంది కనుక. ఇక్కడ వాటి అసలు ఆకారం కాదు కావలసింది, అవి మన కంటికి ఎలా కనిపిస్తాయో అనేది. ఇక 'క్యూబిజానికి ' 'పికాసో ' నాయకుడు. నీగ్రో కళ ప్రభావంతో వెలువడిన ఉద్యమం యిది. ఇందులో దృశ్యాన్ని కోణాకృతులుగ్తా విడదీసి చిత్రిస్తారు. ఒక పెద్ద రాయుఇ వేస్తాడు, ప్రక్కనే ఒక చిన్న రాయి వేస్తాడు. అంటే అవి తల్లీ పిల్లలన్నమాట. రెండూ సమానమైన రాళ్ళువేస్తే ప్రేయసి ప్రియులన్నమాట. 'సర్రిలియజిం ' ప్రాయిడ్ మనో విశ్లేషణ నుండి ఉదయించిన ఆలోచనా సరళి. నాలుగు