పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/143

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గియ్యడం? అడవులు, వేట అంటే అని చూసినచ్వి గనుక చిత్రించారు. ఇవేలాగ? రాముడెలా వుంటాదు? కృష్ణుడెలా వుంటాడు? నలుపా, తెలుపా? ఆభరణాలేమిటి? మెడలో పూలదండా? పూసలదండా? చేతిలో ఎముంటుంది? ఇక్కడే చిత్రలేఖనం సాహిత్యం వైపు చూదవలసి వచ్చింది. ఉదాహరణకు సాహిత్యంలో కృష్ణుడిలాఉంటాడని చెప్పారు-

"కస్ద్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం
  నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరేకంకణం
  సర్వాంగే హరి చందనంచ కలయం కంఠేచ ముక్తావళీం
  గోపస్త్రీ పరివేష్ఠితో విజయతే గోపాల చూడామణీ!"

ఇలాంటి వాటిని పరిశీలించి కృష్ణుని బొమ్మగీసాడు. ఇలాగే సాహిత్యం నుండి చిత్రలేఖనం సృష్టి జరిగినట్లే అటు చిత్రలేకనంనుంది కూడా చాలా సాహిత్య సృష్టి జరిగింది.

అనాదినుండి యిలా వవిత్వం, చిత్రలేఖనం పరస్పర ప్రభావాల్ని కలిగి సహచరత్వాన్ని నెరపుతున్నాయి. కారణం ఇవి రెండూ భావ ప్రధానమే గనుక. రెంటికీ స్థానం హృదయమెగనుక. సింహాన్ని చూస్తే భౌయపడతాం, షింహం బొమ్మ్లని చూస్తే ఆనందిస్తాం. అదీ చిత్రలెఖనం యొక్క గొప్పతనం. ఇది అందరికీ అలవడేది కాదు.

భారతదేశంలో చిత్రలేఖనం గురించి ఆలోచిస్తే పూర్వం ఎందరో రాజులూ, రాణులూకూడా యిందులో నిపుణులు, నిష్ఠాతులూ అయి వుండేవారని తెలుస్తుంది. రాత్రి కలలో కనిపించిన రాకుమారుణ్ణి రాజకుమార్తె ప్రేమించి అతని రూపు రేఖావిలాసాల్ని కుంచెతో చిత్రించడం. రాజాతని వెతికితెచ్చి పెళ్ళిచెయ్యడం ఎన్నో విన్నాం. ఉషాఅనిరుద్ధుల కధ యిదేగా! ఆధునికకాలంలో జాతీయ అంతర్జాతీయ ప్రఖ్యాతి బడసిన 'రవివ్ర్మ ' (తిరువాంకూరు రాజు) చిత్రాలలో జీవకళ ఉట్టిపడేటట్టు చిత్రించిన గొప్ప చిత్రకారుడు. రాముని బొమ్మ వేస్తే సజీవుడై రాముడు కదలిస్తున్నట్టే. దేఫతాప్;అరంగా వృద్ధిపొందిన యీ చిత్రకళ నవీన ప్రపంచంలో ఒక క్రొత్త మలుపు తిరిగింది. ఈనాదు ఆర్ధిక, సాంఘిక, రాజకీయ, కళారంగాలలో పేరుకుపోయిన కాలుష్యాన్ని, కడిగెయ్యడానికి గొప్ప ఆయుధంగా మారింది. ఆపరిణామమే యీ నాటి కార్టూనులు.