పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/103

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పరిసర గ్రామాల్లో అమ్ముకుంటూ చాలీ చాలని ఆదాయంతో పిల్లా జెల్లా పోషించుకుంటూ జీవనయాత్ర సాగిస్తున్నారు. వీరు కొండప్రాంతాలలో అక్కడక్కడ గుంపులు గుంపులుగా ఉంటుంటారు. ఈ గుంఫులనే తండాలంటారు.

వీరి ఆచారాలు చాలా విచిత్రంగా ఉంటాయి. వీళ్ళలో భర్త చచ్చిపొతే మరిదిని పెళ్ళిచేసుకుంటారట. ఈ సంప్రదాయమెక్కడిదని అడిగితే తమది వాలి సుగ్రీవ వండ్శమని చెప్పింది. (అవును, వాలి చనిపోతే తార మరిది సుగ్రీవుణ్ణిపెళ్ళి చేసుకుందిగా!) ఆంజనేయుడు వీరికి మేనల్లుడట, వీళ్ళ రధ్యదైవాల్లో ఆంజనేయుడిది పెద్ద పీట. వీళ్ళల్లోకులాలు లేవు- గోత్రాలు మాత్రం కోకొల్లలు-బాణావత్తు, భూక్కా, ధరావత్తు, భరోతు, వాంకుడోతు, పాల్తియా, జర్సలా, అంగోతు, కొత్త కేడతు యిలాగ ఎన్నో గోత్రాలున్నాయట. కాని సగోత్రీకుణ్ణీ పెళ్ళీచేసుకొకూడదనేది వీళ్ళ కఠోర నియమం. ఇలాగ స్వకులస్తుల్నిపెళ్ళిచేసుకొకూడదని మనగాళ్ళుకూడా ఒక శాసనం పెట్టిస్తే దేశానికి కులాల బెడదే లేకుండా పోను.

వీళ్ళ పెళ్ళిళ్ళలో మరో విచిత్రం పెళ్ళి రోజంతా వీళ్లు ఏడుస్తారు. కారణం, తమ అమ్మాయి ఆ రోజు తమనువీడి అత్తవరింటికి వెళ్ళిపోతుందన్మట. దానికి అంతగా ఏదవాలా అంటే వీరిలో అత్తవారింటికి వెళ్ళిన అమ్మాయి తిరిగి పుట్టింటికి రావడం అరుదట. అప్పుడప్పుడు బజార్లలో మనం చూస్తుంటాం లంబాడీస్త్రీలు ఒకరినొకరు కావలించుకు ఏడుస్తుండడం. అలా ఏడుస్తూ కనిపించారంటే అక్కడ అనుకోకుండా ఎంతో కాలం తరువాత ఆ తల్లీ కూగుళ్లుగాని ఆత్మబంధువులుగాని కలిసేరన్నమాట. ఇది సంచారజాతిగదా! వీళ్ళ పెళ్ళితంతులో ముఖ్యమైనది పెళ్ళికూతుర్ని ఎద్దుపై నిలబెట్టి "బోరాయేతోతో, హనహనకరతో" "దియా.....రే, రే....మా....రీ.....అన్ వో----- కే----జీ, ఇందా-----నే----డి"

అని విషాదంగా పాటపాడుతూ అందరూ ఏదుస్తుంటారు. -అప్పుడు ఆ ఎద్దుకూడా ఏదుస్తుందట. అంత కరుణ రసాత్మకంగాపాడతారన్న మాట. అది మన అప్పగింతలపాటలాటిది. ఈ భాష బాగా పరిశీలిస్తే