పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/104

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అక్కడక్కడ హిందీకి, కొన్నిచోట్ల మూలద్రావిడ భాషకూ కొంత చేరువుగా కంజ్పిస్తొంది. అన్నను, ‘బియా ‘ అంటారు. (హిందీలో భాషా జన్యమైన తెలుగులో జానపదులు తండ్రిని బాబా అని పిలవడం కద్దు).

పెళ్ళివారు మరదలువరుసపిల్ల పెళ్ళికొడుకు చెవులు చిల్లపెంకులతో గట్టిగా నొక్కుతుంది. అప్పుడు ఎంత భాధకలిగినా అతడు అబ్బా! అనడానికి వీల్లేదు. అంతేకాకుండా పెళ్ళీకి కట్టుకునే కొత్త పంచి నీటిలో తడిపి మరదలుపిల్ల పెళ్ళీకొడుకు మెడమీదవేసి దానిపై రోకలిబండతో కుడివైపు మూడుదెబ్బలు, ఎడమవైపు 4 దెబ్బలూ కొడుతుంది. ఎంత గట్టిగా కొట్టినా అభ్భా! అనకూడదు. ఈబావా మరదళ్ళ మోటు సరసం పెళ్ళికొడుకు సహనానికి పరీక్షలాంటిది. మరో విచిత్రంపెళ్ళి పందిరికి మనం మామిడాకుల తోరణాలు కడతాంకదా! వీరు పందిరికి జిల్లేడుమడములు కడతారట. దీని ప్రాశస్త్య మేమిటోమరి!

ఇక వీరివి వరకట్నాలు కావు- కన్యా శుల్కాలు, పెండ్లికొడుకు ఆడపిల్లతం డ్రికి 3 గిత్తలు యివ్వాలి (ఎద్దులు)- వోలిగా 50 రూపాయలు యివ్వాలి. ఆడపెళ్ళివారు తమ పిల్లకు తమస్థాయినిబట్టి ఇత్తడి జూకాలు, వెండి కుచ్చులు, ముక్కుపోగు వగైరా లంబాడీ ఆభరణాలు పెడతారు. పెళ్ళి పెళ్ళికూతురింటి దగ్గరే చెయ్యాలి. గర్బాదానం మాత్రం పెళ్ళికొడుకు ఇంట చేస్తారు. పెళ్ళిలో మొదటితంతు పెళ్ళికూతురుదండకు ఆడపడుచులు దంతపుగాజులు తొడగటమట. ఇది మన మంగళసూత్రధారణ లాంటిది. కాళ్ళకు వాంకిణి (కడియాలు) తొడుగుతారు. తలవెంట్రుకలకు జూకాలు తగిలిస్తారు. ఇవి ఉంటే ఆస్త్రీకి పెళ్ళయినభర్త ఉన్నట్టు లెక్క. భర్త చనిపోయినప్పుడు ఇవి తీసేస్తారు.

వీళ్ళలో స్త్రీ వ్యభిచారం నేరం. ఇతర జాతుల వారితో వ్యభిచరిస్తే ఆమెను వేలేస్తారు. స్వజాతి వారితో అయితే తండా పెద్ద తప్పువేస్తాడు. వీరిలో బహుభార్యాత్వం తప్పుకాదు. బహుభతృమే తప్పు. ఈజాతిలో ఒకరికొకరు సాధారణంగా పిల్లల్ని పెంపకం యివ్వరు. అందువల్ల పిల్లలు లేనివాళ్లు యానాదివగైరా యితర కులాల పిల్లల్ని పెంచు