పుట:Gidugu Rammurthy Mundu matalu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

సోర మాన్యుయల్

భేదములు కనిపిస్తాయి. ఒక్కొకసారి వయస్సును బట్టి, ఆడ, మగ తేడాను బట్టి కూడ ఉచ్ఛారణ మారుతుంది. ఒకే వ్యక్తి మాటల్లో కూడ అతని భావస్థితి ననుసరించి, వేగము, స్థాయి, తీవ్రతననుసరించి భేదాలుంటాయి.[1] ఒక్కనికైనా అక్షరంజ్ఞానంలేని సంఘములో ఇది తప్పనిసరి. అన్ని సజీవ భాషల వలెనే సోరభాష కూడ మాండలికాలలోనే జీవిస్తున్నది. సోర భాషను మాతృభాషగా మాట్లాడే వారికి భేదాలున్నప్పటికీ ఒకరినొకరు అర్థం చేసుకోగలరు. అయితే ఈ భేదాలు మరీ హద్దుమీరి అర్థం కానివి కాకూడదు. నేను గుమ్మ ప్రాంతాన్ని చివరలో చూచాను. అయితే సవర భాషను నేర్చుకొను విద్యార్థులు ఈ గుమ్మమాండలికాన్నే మొదట అభ్యసించాలని నేను ఎంపిక చేశాను. ఈ మాండలికాన్ని ప్రామాణికంగా తీసుకొనవచ్చును. దుర్గమ ప్రాంతాలలో కూడ ఇది ఒకే విధంగా, ఆచరణ యోగ్యంగా ఉంటుంది. ఇతర ముఠావాళ్ళకు కూడ ఇది అర్థమౌతుంది. సోరలందరూ దీని ఆధిక్యతను, స్వచ్ఛతను గుర్తించారు. ఒకటి మాత్రం మనం గుర్తుంచుకోవాలి. “మాట్లాడే భాష ఏదీ వాస్తవానికి ప్రామాణికం కాదు. ప్రామాణిక ఆంగ్ల భాషను మాట్లాడే ఏ ఇద్దరి ఉచ్ఛారణ కూడ ఒకేవిధంగా ఉండదు."[2]

సోరభాషాధ్వనులలోని భేదాలను కొన్నిటిని మొదటి విభాగం (పేజీ 9)లో చూపించాను. మిగిలినవాటిని చూపుటకు చొరవ చేయలేదు. కొత్త వారికి ఈ భేదాలను ఎక్కువగా చూపినట్లయిన వారు గాభరా పడే ప్రమాదముంది. సోర భాషను నేర్చు కొనే తెలివైన విద్యార్థి సోరలతో మాట్లాడి అనుభవము గడించిన తరువాత ప్రామాణికమైన భాషకు పాఠ్య భేదములున్న భాషకుగల తేడాలను గ్రహించగలడు. వేరు వేరు ముఠాల వారితోను, తాలూకా కచ్చేరీలకు వచ్చిన వారితోను, రహదారి బంగళాలలో ఉద్యోగస్థులను కలుసుకున్న సమయంలో సోరలు వారితో మాట్లాడునపుడు ఆ భేదాలను గుర్తించగలరు. ఇటువంటి పాఠ్యభేదాలు ఒరియా, తెలుగు, ఇంగ్లీషు- వాస్తవానికి అన్ని సజీవ భాషలలోనూ ఉంటాయి.

సోర భాషలోని కొన్ని అసాధారణ లక్షణాలను గుర్తించడం అవసరం.

(1) అవరోధితహల్లులకు (ckecked consonants) (4వ పేజీ), “అవరోధిత అచ్చులకు" (ckecked vowels) (కంఠమూలీయ అవరోధం; glottal ckeck, 5వ పేజీ) సోరభాషలో తేడా


  1. 1. విదేశీ భాషలు, మాండలికాల లోని దురవగాహమైన ఊనికను వివరించడం కష్టం. స్పష్టమైన, మరీ అంత స్పష్టంగాని ధ్వనులను అలవాటుగా పలికేవారు కూడా గుర్తించలేనన్ని ఎక్కువ ధ్వనులు భాషలో ఉంటాయి. సపీర్, 'భాష' పేజీ 44
  2. 2. ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా.