పుట:Gidugu Rammurthy Mundu matalu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

సోర మాన్యుయల్

కంటిచూపు ఎంతో బాగుండాలి. ఒరియా పుస్తకాన్ని యాదాలాపంగా చూచిన వారికి అందులో అక్షరాలు కేవలం వంపులు గానే కనిపిస్తాయి. రెండవసారి చూస్తేగాని లోపల ఉన్నవి కనబడవు.” అని మద్రాసు పరిపాలనా సంబంధ మాన్యుయల్ లో, పూరీ జిల్లా గెజిటీలో వ్రాశారు.[1] మిడ్నాపూర్ లో “ఒరియా అక్షరాలను కాదని బెంగాలీ అక్షరాలనే వాడుతున్నారు.” బస్తరులో ఒరియా భాషకు దేవనాగరి లిపిని వాడుతారు. ఒరియా అక్షరమాలలోని తొలి అక్షరము మామూలుగా వచ్చే 'అ' ధ్వనితో ప్రారంభము కాదు. ఇంగ్లీషు 'హాట్ 'అనే మాటలోని అచ్చు ఎలా వినిపిస్తుందో అలా ఉంటుంది. ఈ ధ్వని ఒరియా అక్షరమాలలోని ప్రతి హల్లులోను స్వాభావికముగా ఉంటుంది. ఒరియా మాటలలో చాల తరచుగా వినిపిస్తుంది. [2] ఒరియా అక్షరమాల సోర భాషకు ఉపయోగపడదు. దేవనాగరలిపి కూడ ఈ భాషకు తగనిదని భాషా పరిశీలనలో తేలింది. కుమౌనీ భాషలోని అచ్చు శబ్దాలను మామూలు దేవనాగరిలిపిలో చూపలేము. నేను వాడిన నమూనాలను ప్రతి లిఖించగా వాటి ఉచ్ఛారణ అసంపూర్తిగాను, ఒక్కొకసారి తప్పుదోవ పట్టించేదిగాను ఉంది. ఆ భాషా వ్యాకరణము ఒక్కొకసారి ధ్వనుల మార్పుపై ఆధారపడి ఉంటుంది. ఆ ధ్వనులను పూర్తిగా రాతలో చూపలేము."[3]


  1. 1. జిల్లా గెజట్ , వూరి, పేజీ 69
  2. 2. కీ||శే. ఎ.సి.రఫ్, ఐ.సి. ఎస్. గారు ఖోండు భాషకు ఒరియా అక్షరాల వాడకాన్ని త్రోసిపుచ్చారు. వారి అభిప్రాయం సవర భాషకు కూడ వర్తిస్తుంది. 1911 లో వారు ఖోండ్ భాషకు ఒరియా అక్షరాల వాడకం గురించి ఈ విధంగా వివరించారు. "అది ఏవిధంగా సాధ్యమో నాకు తెలియదని నేను అంగీకరిస్తున్నాను. ఒరియా భాషలో కురచ 'అ' అక్షరం లేదు. కాని ఖోండు భాషలో పొట్టి 'అ' పొడవు 'అ' కు గల ఒక్క బేధము వలన ఆ భాషలో 'ఔను' లేదా 'కాదు' అనే అభిప్రాయము విదితమవుతుంది. మాటలలో తెలియజేసే అంత ముఖ్యమైన తేడాను వ్రాతలో తెలియజేయలేని లిపి నాదృష్టిలో తిరస్కరించదగినది. ఈ ఒక్క ఇబ్బందే కాదు. అయితే అన్నిటికంటె ఇదే చాల తీవ్రమైనది. ఆమధ్య నేను ఒక ఖోండుకు ఆ భాషలో చెప్పిన వాక్యాన్ని ఒరియా అక్షరాలలో వ్రాయమని కోరాను. అతడు సహజంగానే ఖోండ్ కురచ 'అ' కొరకు ధీర్ఘాక్షరాన్నే వాడాడు. అందువలన దీర్ఘ 'ఆ' కు మరి వేరే అక్షరం లేకపోయింది." సెరంగోలోని గవర్నమెంట్ ట్రయినింగ్ స్కూలులో నా వద్ద సవర నేర్చుకున్న ఉపాధ్యాయులు సవర పదాలను ఒరియా అక్షరాలలో వ్రాయునపుడు కలిగే గందరగోళాన్ని వదిలించుకోవడం అసాధ్యమైపోతున్నదంటూ ఏజెంటుగారి అభిప్రాయాన్ని అంగీకరించారు.
  3. 3. లింగ్విస్టిక్ సర్వే 9, 4