పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/39

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


        మండు వేసవిటెండ పండువెన్నెలయట్లు
        భావించి నీకునై పరుగెత్తి వచ్చితినె
             మగువరో! యింతలో మాయమైపోతే ?

        నోరార దాహమున కోరికల నువ్విళ్ళ
        నూరి ప్రాణము నిల్పి పారి వచ్చితినే
             మగువరో! యింతలో మాయమైపోతే ?

        వడదాక నెమ్మేను వడిపోయి తరువట్లు
        కడగండ్లు దీర్తు వని వడిలేచి వచ్చితినె
             మగువరో! యింతలో మాయమైపోతే ?

        ఇంత మోసము జేయ నింతి నీ కేలనే
        భ్రాంతి గొన్నందులకు వంతగూర్చితివే
             మగువరో యింతలో మాయమైపోతే ?