పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/25

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చంద్ర గ్రహణము

      రాబోకు రాబోకురా చందమామ!
      రాహు పొంచున్నాడురా తోవలోన!

           ఆ కొక్కటైనాను
           అల్లాడ కున్నాది,
           మబ్బులపై నేదొ
           మాయకప్పేసింది! ||రాబోకు||

     తెల్లన్ని నీ కాంతి
     నల్ల నయ్యేనురా!
     చల్లన్ని నీ మోము
     సన్నగిల్లేనురా! ||రాబోకు||

           పరమ రాకాసిరా
           పాపిష్టి రాహువు,
           మిత్తిలా నిను బట్టి
           మింగ బొయ్యేనురా?

     రాబోకు రాబోకురా! చందమామ!
     రాహు పొంచున్నాడురా తోవలోన!