పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/26

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కోణంగి పద్దు

          పన్నెండేళ్ళ చిన్నాడే
          పైట కొల్ల గొన్నాడే
          అడగవమ్మ అడగవమ్మ
          అమ్మ యశోదమ్మా!

      చీకటైన కాలేదే,
      రాకపోక లాగలేదే!
      లోకానికి జడవొద్దా?
      పోకిళ్ళకి అదు పొద్దా? ||పన్నెండేళ్ళ||

          ఇంటి కిల్లాలిని గాదే
          కంటబడితె తంటాలౌనె!
          అంటే నీకు కోపమొద్దే
          కొంటీ కోణంగిపద్దే! ||పన్నెండేళ్ళ||

      వొట్టే నలుగురిలో తల
      గొట్టినట్టు లాయెనమ్మ!
      ఏంతో టబ్బరాలైనా
      ఇంతపనులు జేసేనా?

          పన్నెండేళ్ళ చిన్నాడే,
          పైట కొల్లగొన్నాడే
          అడగవమ్మ అడగవమ్మ
          అమ్మ యశోదమ్మా!