ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ముత్యాల ముగ్గులూ, రత్నాల తోరణాలు
మాణిక్యాల మంటపమటా,
మన లక్ష్మి పెండ్లికి ||పోదాము||
సంద్రమె పెళ్ళిల్లంట, సదస్యులు దేవతలంట
ఉప్పే తలంబ్రాలటా,
మన లక్ష్మి పెండ్లికి ||పోదాము||
గాంధీ వశిష్ఠంట, కస్తురమ్మ ముత్తైదంట
పరమాత్ముడే సాక్షిటా,
మన లక్ష్మి పెండ్లికి,
పోదాము స్వరాజ్యలక్ష్మి పెండ్లిజూడ
రారే రమణులారా !
జాతీయ పతాకము
పతాకోత్సవము సేయండీ
స్వతంత్రభారత జాతిచిహ్నమౌ ||ప||
కొత్తవన్నెలూ కొత్తచిన్నెలూ
కొత్తజీవమూ కొమ రొప్పంగా