ఈ పుట అచ్చుదిద్దబడ్డది
నూతనభారతజాతికి భువిలో
ఖ్యాతీ జయమూ కలగాలంటూ ||ప||
వీర కేసరుల యెఱ్ఱనిరంగూ
దేశసేవకుల తెల్లనిరంగూ
భక్తులపాలిటి పచ్చనిరంగూ
బీదలపెన్నిధి రాటపుమెఱపే ||ప||
అన్ని మతాలకు అన్ని తెగలకూ
ఆశ్రయ మీజండా ఒకటేనోయ్
ప్రాణము పోతే పోనీ జండా
మానముమాత్రము మంటగలపక ||ప||
రాట్నము
సిగ్గు లేదా నీకు శిరము లేదా
అన్నమైనా లేక బీద లల్లాడుతుంటేను
సీతాకోక చిలుకలాగ సీమగుడ్డ కట్టితిరుగ ||సి||
పూటకూడులేని ప్రజకు రాట్న మొకటే పెన్నిధుండ
మోటంచు పవిత్రమైన రాటంఖద్దరు వెక్కిరింప ||సి||