పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గాంథీప్రభ

             గాంధిమహాత్ముడు బయలుదేరగా కలకల నవ్విందీ,
                            జగత్తూ కలకల నవ్విందీ ||గాంధి||
             గాంధిమహాత్ముడు చకచక నడువగ కంపించి పోయిందీ,
                            భూదేవి, కంపించిపోయింది ||గాంధి||
             గాంధిమహాత్ముడు కన్ను విప్పగా గడగడ వణకిందీ,
                            అధర్మము, గడగడ వణకిందీ ||గాంధి||
             గాంధిమహాత్ముడు నవ్వు నవ్వగా కన్నుల గట్టిందీ,
                            స్వరాజ్యం, కన్నుల గట్టిందీ ||గాంధి||
             గాంధిమహాత్ముడు గొంతు విప్పగా, గణగణ మ్రోగిందీ,
                            ప్రణవము, గణగణ మ్రోగిందీ ||గాంధి||
             గాంధిమహాత్ముడు స్వస్తి బాడగా కరముల దొరికిందీ,
                            మోక్షము, కరముల దొరికిందీ ||గాంధి||