పుట:Geethamulu, basavaraju apparao (1934).pdf/202

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నాల్గు పరకల పిలక
నాట్యమాడే పిలక
నాలుగూవేదాల
నాణ్య మెరిగిన పిలక ||కొల్లాయి||
   బోసినో ర్విప్పితే
   ముత్యాల తొలకరే
   చిఱునవ్వు నవ్వితే
   వరహాల వర్షమే ||కొల్లాయి||
చకచక నడిస్తేను
జగతి కంపించేను
పలుకు పలికీతేను
బ్రహ్మవాక్కేను ||కొల్లాయి||
    కౌశికుడు క్షత్రియుడు
    కాలేద బ్రహ్మఋషి
    నేడు కోమటిబిడ్డ
    కూడ బ్రహ్మర్షాయె ||కొల్లాయి||