పుట:Geetham Geetha Total.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓమ్‌

శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

శ్రీ మద్భగవద్గీత

షష్ఠాధ్యాయము

ఆత్మ సంయమ యోగము


శ్రీ భగవంతుడిట్లనియె :-

01. తే. కర్మఫల మాశ్రయింపక కార్యములను
జేయవలసినవని యెంచిచేయు నెవఁడు;
వాఁడె నిజ మైన సన్న్యాసిÑ వాఁడె యోగి;
అగ్నులను గ్రియలను మానునతఁడు గాఁడు.

02. తే. దేని సన్న్యాస మందురు జ్ఞానులెల్ల
రదియు కర్మయోగ మటంచు మది నెఱుఁగుము;
మహిని మనుజుండు సంకల్పరహితుఁ డైనఁ
గాని, లభ్యంబు గాదు యోగం బతనికి.

03. తే. ఆత్మదర్శనమును గోరునట్టి మునికి
సహజముగఁ గర్మయోగంబె సాధనంబు;
యోగ మందినపిమ్మట యుక్తతముఁడు
శమము వహియింప నగు మోక్షసాధనముగ.

04. తే. ఎప్పుడగు సంగవర్జితం బింద్రియార్థ
విషయములయందుఁ దత్కర్మ విధులయందు,
నపుడె సర్వసంకల్ప సన్న్యాసి యగుచు
నరుఁడు యోగ మందినవాఁడ నంగఁ బరఁగు.

05. ఆ. మనసుచేత నాత్మకెనయు నౌన్నత్యంబు;
అధమగతికిఁ గూడనదియె పంపు;
కనుక నాత్మయెడల మనసు చరించెడు
మిత్ర మగుచు మఱియు శత్రు వగుచు.