పుట:Geetham Geetha Total.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిత్రము : స్వయంవరం (1982)
పాట : గాలి వానలో వాన నీటిలో
""""""""""""""""""""""""""""""""""""""""""""""
కాలవీధిలో బ్రతుకుబాటలో తనువు ప్రయాణం
జన్మమెక్కడో, కర్మమేమిటో తెలియదు పాపం, తెలియదుపాపం

చ॥ ఇటు ఘోరకర్మమని తెలుసూ, అటు మరల జన్మమని తెలుసూ
ఘోరకర్మతో మరల జన్మలో సాగలేనని తెలుసూ
ఇటు పాడు మాయయని తెలుసూ, అటు బాధ సుడులని తెలుసూ
పాడు మాయలో బాధసుడులలో మునక తప్పదని తెలుసు
అయినా తనువు ప్రయాణం జన్మమెక్కడో, కర్మమేమిటో తెలియదు పాపం,తెలియదు పాపం

చ॥ మది ఆశనిరాశల ఆరాటం, హృది చీకటి వెలుగుల చెలగాటం
ఆశజారినా వెలుగు తొలగినా ఆగదు జీవిత పోరాటం
ఇది మనిషీ మనసుల పోరాటం, అది తనువూ ఆత్మల చెలగాటం
జ్ఞానదూరమై మనసు చపలమై బ్రతుకుతున్నదొక శవం
అయినా తనువు ప్రయాణం జన్మమెక్కడో, కర్మమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం

కాలవీధిలో బ్రతుకుబాటలో తనువు ప్రయాణం
జన్మమెక్కడో, కర్మమేమిటో తెలియదు పాపం, తెలియదుపాపం


గమనిక:- ఈ సినిమా పాటలన్నీ ఇంటర్నెట్లో లభిస్తాయి. ఆ పాటల లయను అనుసరించి మీరు పాడుకోవచ్చును.