పుట:Geetham Geetha Total.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గీతం - గీత

చిత్రము : మేఘ సందేశం (1983)
పాట : ఆకాశదేశానా-ఆషాఢమాసాన
""""""""""""""""""""""""""""""""""""""
కర్మాల నీడాన, కష్టాల రూపాన, నలిగేటి ఓ జీవమా, నలిగేటి ఓ
జీవమా...

కామమో క్రోధమో ఎనలేని మోహమో
వినిపించు నీహృదికీ జ్ఞానసందేశం జ్ఞానసందేశం

చ॥ మామగారి కోడలివై, కన్నవారి కూతురువై
మామగారి కోడలివై, కన్నవారి కూతురువై
ఈ జగాన పాత్రలలో, కరిగి నీవు నిలిచావనీ, కడలివోలె మిగిలావని
తరగని కరగని సారముతో, తెలిసిన పలుకుల భావముతో
విన్నవించు నీ హృదికీ, జ్ఞానసాధనా, నా పరమసాధనా
కర్మాల నీడాన, కష్టాన రూపాన, నలిగేటి ఓ జీవమా, నలిగేటి ఓ
జీవమా...

కామమో, క్రోధమో, ఎనలేని మోహమో
వినిపించు నీ హృదికీ జ్ఞానసందేశం జ్ఞాన సందేశం

చ॥ రాలిపోవు తనువునకై, వీడిపోవు జీవునవై
ఈ కసాయి కాలములో నివురులాగ మిగిలావని, శిథిల జీవివైనావని
పలికిన పలుకుల సారముతో, మధుర భావ జలధారలతో
విన్నవించు నీహృదికీ, మనోసాధనా నా జ్ఞాన సాధనా
కర్మాల నీడానా, కష్టాల రూపాన నలిగేటి ఓ జీవమా, నలిగేటి ఓ
జీవమా...

కామమో క్రోధమో ఎనలేని మోహమో
వినిపించు నీహృదికీ జ్ఞానసందేశం జ్ఞానసందేశం