పుట:Geetham Geetha Total.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

05.తే. కామరాగబలాన్వితగమను లగుచు
దంభసంయుక్తగర్వమదంబు లొలయ
దారుణములును శాస్త్రాప చారకరము
లైనతపముల జరిపించు నట్టి జనులు.

06. తే. మూఢులై తమ లోభూతములకె కాక
వానిలోపలినాకును హాని సలిపి
న్రుక్కఁజేతురు; వారి దాసురమతం బ
టం టెఱుంగుము నీవు బలారితనయ;

07. తే. సర్వభూతంబులకును భోజనపదార్థ
సమితి సహితంబు త్రివిధ మై సలుపుఁ బ్రీతి;
నట్టులే దానములు తపో యజ్ఞములును
జెలఁగఁ; దద్భేదముల నీకుఁ జెపుదు వినుము.

08. తే. ఆయురారోగ్యసత్త్వ సంధాయకములు
బలసుఖప్రీతివర్ధితములు, మనోహ
రములు స్నిగ్ధముల్‌ స్థిరములు రస్యములును
సత్త్వజనులకుఁ బ్రీతిభోజనము లగును.

09. తే. ఉప్పులును జేఁదుపులుసు లత్యుష్ణతీక్ష్ణ
కరములును రూక్షదాహశోకప్రదములు
వ్యాధిపూరితములు దుఃఖవంతములును
రాజసులభు క్తి కిష్టకరములు పార్థ!

10. తే. యాతయామంబు గతరస పూతి పర్యు
షితము లుచ్ఛిష్టమును బవి త్రతఁ బడయని
యట్టి వస్తుజాలంబు లాహారము లగుఁ
దామసుల కెల్లరకుఁ బ్రియ తమము లగుచు.