పుట:Geetham Geetha Total.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓమ్‌

శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

శ్రీమద్భగవద్గీత

పంచదశాధ్యాయము.

పురుషోత్తమప్రాప్తి యోగము


శ్రీ భగవంతుడిట్లనియె :-

01. తే. ఊర్ధ్వమూల మధశ్శాఖ లొప్పుదాని
నవ్యయం బగునశ్వత్థ మనెడుదాని
వేదము ల్పర్ణములు గాఁగ వెలయుదాని
నెఱుఁగువాఁడగు వేదంబు లెఱుఁగువాఁడు.

02. తే. వృద్ధిఁ ద్రి గుణంబులం గల్గి విషయపల్ల
వముల తచ్చాఖ లధమ మూర్ధ్వంబు ప్రాఁకె;
మఱి యధోగతికిని జొచ్చె మనుజలోక
మునకుఁ దన్మూలములు కర్మములఫలములు.

03. తే. దానిరూపంబు, నాది, యంత్యంబు, మఱియు
సంప్రతిష్ఠయు, నెఱుఁగంగఁ జనదు మహిని;
ఇట్టి దృఢమూల మశ్వత్థ వృక్షమును న
సంగశస్త్రంబుచే నఱుకంగ వలయు.

04. ఆ. ఎందుఁ జనినవారలందుండి మరలరో
యట్టిపదముఁ బిదప నరయవలయు;
ఎవని వలనఁ బుట్టి యీప్రవృతి చెలంగె
శరణ మట్టియాది పురుషుఁ డనుచు.

05. తే. మానమోహము ల్వీడి కామంబు గెలిచి
సంగజితులును నాత్మవిజ్ఞాను లగుచు
ద్వంద్వములు సుఖదుఃఖముల్వదలివైచి
పడయుదురు జ్ఞాను లవ్యయపదము నెపుడు.