పుట:Geetham Geetha Total.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ భగవంతుడిట్లనియె :-

47. తే. ఆద్యమును విశ్వమయము ననంతమైన
తేజమునఁ జెలఁగెడుదీనిఁ దెలియ రెవరుఁ;
గలిగె నీ కిది నాయనుగ్రహమువలన;
ధన్యుఁడవు నీవు పార్థ! యీ దర్శనమున.

48. ఆ. మహిని నీవుదక్క మఱియెవ్వరును దీనిఁ
గనినవారు లేరు ఘనగుణాఢ్య!
వివిధక్రియలవలన వేదాధ్యయనమున
దానములను నుగ్రతపము వలన.

49. తే. ఈభయంకరమౌ రూపమీవు చూచి
భయముఁ జెందకు మోహమన్వలను బడకు;
భీతి విడిపోవ నీకు సంప్రీతి గలుగఁ
జూవుచున్నాఁడ ముందటిరూపు మరల.

అర్జునుడిట్లనియె :-

51. తే. మనుజరూపంబు నీదుసౌమ్యస్వభావ
మైనయాకృతి గనుట, నాయంతరంగ
మందు స్వస్థత చేకూరె నంబుజాక్ష!
మానసంబున నిలుకడ మరలఁగల్గె.

శ్రీ భగవంతుడిట్లనియె :-

52. ఆ. పార్థ ! నీవు గనిన బ్రహ్మాండరూపంబు
పరులు గనుట దుర్లభంబు సుమ్మి;
దేవతలును నాదు దివ్యాకృతినిఁ జూడఁ
గాంక్ష ననవరతము గల్గి యుంద్రు.