పుట:Geetham Geetha Total.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16.తే. ఆదిమధ్యాంతరహింతుడవై సహస్ర
బాహువక్త్రనేత్రంబులఁ బరంగుచుండు
నీయనంతరూపంబు నా నేత్రములకు
గోచరం బాయెఁ గృష్ణ ! నీకూర్మివలన!

18. తే. సర్వవేదముల ల్దెలువున క్షరమ వీవ;
అఖిలజగముల కాధారమగుదు వీవ;
శాశ్వతుండవు ధర్మసం స్థాపకుఁడవు;
మూలకర్తవు పురుషోత్తముఁడవు నీవ.

19. తే.ఆదిమధ్యాంత రహితుండవౌననంత
బాహుఁడవు వీర్యుఁడవు శశి భాస్కరాక్షుఁ
డవు హుతాశనసమవక్త్రుఁడవు స్వతేజ
తప్త భువనుండ; వబ్బె నీ దర్శనంబు.

20. తే. మహికి నాకాశమునకును మధ్యమునకు
దిశలకెల్లను వ్యాప్తిఁ జెం దితివి నీవు;
అద్భుతము ఘోరమైన నీయాకృతిఁ గని
వ్యథలఁ జెందెడి లోకత్రయము మహాత్మ!

21. తే. అమరసంతతు ల్నీదేహమందుఁ జొచ్చి
భయముచేఁ గొంద ఱంజలి బద్ధులైరి
స్వస్తిఁ జెప్పిరి మునివరుల్సంతసమునఁ
జేయఁదొడఁగిరి స్తోత్రముల్సిద్ధు లెల్ల.

22. తే. కాంచుచున్నారు నిన్ను దిగ్భ్రమ వహించి
యక్షగంధర్వ సురసిద్ధులశ్వినులును
రుద్రులును సాధ్యులును భాస్కరులుఁ బితరులు
వసువులును మరుత్తు లును బావకులుఁ గూడి.