పుట:Geetham Geetha Total.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18.ఆ.నీదుయోగమహిమ నీవిభూతివిశేష
ముల వచింపు మరల జలజనయన !
ఈ మహామృతంబు నెన్నిసారులు విన్నఁ
దృప్తి లేదు నాకు దేవదేవ !

శ్రీ భగవంతుడిట్లనియె :-

19. ఆ. అకట ! నావిభూతులంత్యంబు లేనట్టి
వగుట విస్తరింప వలను గాదు;
వానియందు ముఖ్యమైనవానిని శుభం
బైనవాని విశద పఱతు వినుము.

20. తే. అన్ని భూతాశయంబుల కాత్మ నగుచు
వాని కాధారముగ నుండు వాఁడ నేన;
అవని సృష్టిని స్థితిని నంత్యమును గూడ
భూతజాలంబు నా చేతఁ బొందుచుండు.

21. తే. సూర్యులందఱలోన విష్ణువును నేన;
జ్యోతులం దెల్ల దినకరజ్యోతి నేన;
వాయువులలో మరీచి యన్వాయు వేన?
ఉడుగుణంబులలోనఁ జంద్రుండను నేన.

22. తే. వేదముల శ్రేష్ఠ మౌసామవేద మేన;
వాసవుండను నేనదేవతలయందు;
ఇంద్రియములందు మానసంబేన; మఱియు
భూతముల కెల్ల నేఁ జుమీ చేతనంబు