పుట:Geetha parichayam Total Book.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కల్గినట్లు ప్రతి మానవునికి గుణముల వలన బాధకల్గుచునే ఉన్నది. ఒక గుణమొక వైపుకు లాగితే మరియొక గుణము ఇంకొక ప్రక్క లాగుచుండును. గుణముల మధ్య చిక్కి నలుగుచున్న మానవునికి అశాంతి కలదు. కావున శ్రీకృష్ణుని గీత అర్జునునికొక్కనికే కాక గుణములున్న జీవరాసులందరికి అవసరమే. శ్రీకృష్ణుడు చెప్పినది అర్జునునకేనని తలచవద్దండి. గుణ ప్రభావములో చిక్కిన అందరికి వర్తించునదిగ తలచి, ప్రతి ఒక్కరు గీత తన నిమిత్తమే చెప్పారని తలచి చదవాలి. ఇపుడు ఇక్కడ వ్రాసిన గీత అర్జునునికేననుకోక శ్రీకృష్ణుడు నీకే చెప్పుచున్నాడను భావముతో శ్రద్ధగా చదవండి.

భగవద్గీత శ్రీ భగవానువాచతో మొదలైనది. శ్రీకృష్ణుడు పల్కిన పలుకులను భగవానువాచ అనడమెందుకు? శ్రీకృష్ణ ఉవాచ అని ఎందునలేదను సంశయము కొందరికుండవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! శ్రీకృష్ణుడు అందరిలాంటి మానవుడు కాదు. అతను అందరిలాగ జన్మించలేదు. ఈ ప్రపంచమంతయు ఏ శక్తి ఆధారముతో నిలచి ఉన్నదో, ఆకాశములో సూర్య,చంద్ర,నక్షత్ర గోళములు ఏ శక్తి ఆధారముతో తమ గమ్యములు తప్పక తేలియాడుచున్నవో, అణువణువున ఏ శక్తి దైవముగ నిలచి అధిపతిగనున్నదో, భూమి విూద గల అన్నిమతములకు ఏ శక్తి దేవునిగ ఉన్నదో ఆ శక్తియే ఒక మానవునిగ వచ్చిన జన్మ శ్రీకృష్ణునిది! శ్రీకృష్ణుడు భగము నుండి పుట్టినవాడు కనుక భగవంతుడను పేరువచ్చినది. భగమనగ స్త్రీయొక్క యోని భాగమని అర్థము. అలాంటపుడు మనము కూడ తల్లి భగము నుండియే పుట్టాము కదా! మనమంతా భగవంతులమేనా? అను ప్రశ్నరాగలదు. ఇక్కడున్న అందరికి తెలియని సత్యమేమిటంటే మనమందరము భగము నుండి పుట్టలేదు. ఈ మాట చాలామందికి ఆశ్చర్యమును కలుగజేయును. ఇందులో సత్యము తెలిస్తే ఆశ్చర్యపడవలసినదేమి లేదు. భగము నుండి మన శరీరములు పుట్టినవి, కాని జీవాత్మలమైన మనము పుట్టలేదు. శిశు శరీరము భగము నుంచి బయటికి