పుట:Geetha parichayam Total Book.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యొక్క సరిహద్దు లోపల ఆ దేశము యొక్క చట్ట రాజ్యాంగముండును. అలాగే శరీరము యొక్క గీత లోపల ఆ శరీరము యొక్క నిబంధన రాజ్యాంగముండును. దేశము యొక్క చట్ట రాజ్యాంగము ఆ దేశము యొక్క పరిధి అను హద్దులోపలనే ఉండును. అలాగే శరీరము యొక్క నిబంధన రాజ్యాంగము, ఆ శరీరము యొక్క పరిధి అనబడు హద్దులోనే ఉండును. దేశమునకు ఒక రాజు ఉన్నట్లు, శరీరమునకు జీవుడు అను ఒక రాజు కలడు. దేశములోని రాజుకు కొంత పరివారమున్నట్లు, శరీరములోని జీవుడను రాజుకు కూడ 25 మంది పరివారము కలరు. దేశములోని రాజు ఒక చోట కూర్చొని తన పరివారము చేత రాజ్యపరిపాలన చేస్తున్నట్లు, శరీరములోని జీవుడు ఒక చోట కదలకవుండి తన పరివారము చేత శరీర పరిపాలన చేస్తున్నాడు. దేశ పరిధిలోని రాజ్యాంగమును తెలుపునది చట్టము. అలాగే శరీర పరిధిలోని యంత్రాంగమును తెలుపునది నిబంధన లేక ధర్మము. చట్టము దేశపరిధిలో ఉన్నట్లు, ధర్మము దేహము యొక్క పరిధిలో ఉన్నది. చట్టములో న్యాయము, అన్యాయము ఉన్నట్లు, ధర్మములో పుణ్యము, పాపములు కలవు. దేశములోని చట్టము, న్యాయా న్యాయములను నిర్ణయించినట్లు, శరీరములోని ధర్మము పుణ్యపాపములను నిర్ణయించుచున్నది.

సరిహద్దును పరిశీలిస్తే అది ఏ దేశమైనది, అందులోని చట్టము ఏమిటి అన్నది తెలియును. అట్లే శరీరహద్దును పరిశీలిస్తే అది ఏ దేహమైనది, దానిలోని ధర్మమేమిటన్నది తెలియును. చట్టమేమిటన్నది దేశ హద్దును చూస్తే తెలియునట్లు, ధర్మమేమిటన్నది దేహ హద్దును చూస్తే తెలియును. నీ శరీరములోపలి ధర్మములేమిటో తెలియాలంటే శరీర గీతలోపలే తెలియాలి. దేహము లోపల గల స్థూల, సూక్ష్మ వివరములను తెలుపునదే గీత, అదియే భగవద్గీత. భగవద్గీతలోని ప్రతి శ్లోకము శరీరపరిధిలోని ధర్మములనే తెలియజేశాయి తప్ప ఏ శ్లోకము శరీరపరిధి దాటి చెప్పలేదు. శరీరపరిధియే ధర్మములకు నిలయమైనది, కావున పరిధిలోపలనే చెప్పబడిన దానిని గీత